అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Dangers of Tilapia for the Environment: ఈ తిలాపియా చేపలు ఎంత ప్రమాదకరమో ఇంకా మన ప్రభుత్వాలకి అర్దం కాలేదనుకుంటా.. ఇతర దేశాలు వీటిపై యుద్దం చేస్తున్నాయి.
థాయ్‌లాండ్‌లో ఈ చేపల వ్యాప్తిని కట్టడి చేసేందుకు 10 బిలియన్ బాట్లు (సుమారు 24,48,05,50,000 రూపాయలు) ఖర్చవుతుందని బ్యాంకాక్ ఎంపీ నట్టాచా అంచనా వేశారు.

సమస్య ఏమిటంటే, ఈ చేపలు ఇతర చిన్నచిన్న చేపలను, రొయ్యలను, నత్త లార్వాలను తింటాయి. థాయిలాండ్ ఆక్వా ఉత్పత్తులలో ఇవన్నీ ప్రధానమైనవి. అందుకే వీటి వ్యాప్తిని అరికట్టడం చాలా ముఖ్యం.
నదులు, చిత్తడి నేలల ద్వారా థాయ్‌లాండ్ జలాల్లోకి ప్రవేశించిన బ్లాక్‌చిన్ తిలాపియా చేపలను పట్టుకోవాలని ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఈ చేపలు ఉప్పు నీటిలో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. మంచి నీటిలో కూడా ఇవి జీవించగలవు.
ఈ చేపలను పట్టుకునే వ్యక్తులకు కిలోకు 15 బాట్లు అంటే దాదాపు 37 రూపాయలు చెల్లిస్తోంది థాయ్ ప్రభుత్వం. దాంతో బ్యాంకాక్ శివార్లలో జనాలు ప్లాస్టిక్ బేసిన్‌లతో మోకాళ్ల లోతు నీటిలో బ్లాక్‌చిన్ తిలాపియా చేపలను పట్టుకుంటున్నారు.
అలాగే బ్లాక్‌చిన్ తిలాపియా చేపలను తినే ఆసియా సీబాస్, క్యాట్ ఫిష్‌లను కూడా థాయ్ జలాల్లో వదిలిపెట్టారు అధికారులు.
అయితే తిలాపియా చేపలు చాలా వేగంగా వృద్ధి చెందుతాయి. ఆడ తిలాపియా చేపలు ఒకేసారి 500 గుడ్లు పెడతాయి.
అయితే వీటిని నిరోధించే దిశగా ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎంపీ నట్టాచా అన్నారు.
ఈ విషయంపై ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలి, వీటి వివారణకు తీసుకుంటున్న చర్యలేంటో తెలుసుకోవాలి. దానికి వారు ఏ విధంగా తోడ్పాటు అందించగలరో ఆలోచించాలి. లేదంటే ఈ విషయం మరుగున పడిపోతుంది. అలా జరిగితే తరువాతి తరం కూడా ఈ చేపల బారిన పడుతుంది” అని ఆయన చెప్పారు.
ఇవి థాయ్‌ల్యాండ్‌లోకి ఎలా వచ్చాయి: పార్లమెంటు పరిశీలించిన ఒక వాదన ప్రకారం, 14 సంవత్సరాల క్రితం ఫుడ్ బెహెమోత్ చారోన్ పోక్‌ఫాండ్ ఫుడ్ (సీపీఎఫ్) సంస్థ చేసిన ప్రయోగం వీటి వ్యాప్తికి కారణమైంది.
పశువుల దాణా ఉత్పత్తి చేసే ఈ సంస్థ రొయ్యలు, పశువుల ఫాంలను కూడా నడుపుతోంది. 2010 చివరలో 2,000 తిలాపియా చేపలను ఈ సంస్థ ఘనా నుంచి దిగుమతి చేసుకుంది.
అయితే అప్పుడు ఆ చేపలన్నీ చనిపోయాయని వాటన్నింటినీ పాతిపెట్టామని ఆ సంస్థ తెలిపింది.
కానీ రెండు సంవత్సరాల తరువాత సీపీఎఫ్ ప్రయోగశాల ఉండే ప్రాంతంతోపాటు థాయ్‌లాండ్ జలాల్లోనూ బ్లాక్‌చిన్ తిలాపియా చేపలు వ్యాప్తిచెందాయని స్థానిక మీడియా సంస్థ థాయ్ పీబీఎస్ పేర్కొంది. కానీ ఈ ఆరోపణలను సీపీఎఫ్ ఖండించింది.
ఈ చేపలు థాయ్ జలాల్లోకి ఎలా వచ్చాయన్నది కాదు, భవిష్యత్తులో వీటి వ్యాప్తి ఎలా ఉంటుంది? వీటిని ఎలా నియంత్రించాలి? అన్నిది సమస్య. కానీ ఇది సాధ్యమేనా? అన్నదే ప్రశ్న.
ఈ పోరాటంలో ఓడిపోయే అవకాశమే ఎక్కువని నిపుణులు చెప్తున్నారు. ఈ చేపలను పూర్తిగా నిర్మూలించే అవకాశం నాకు కనిపించడం లేదు. ఎందుకంటే మేము దాని పరిధిని పరిమితం చేయలేం. అది నిరంతరం పునరుత్పత్తి చేస్తుంది అని వాలాలక్ విశ్వవిద్యాలయానికి చెందిన జన్యుశాస్త్ర నిపుణుడు డాక్టర్ సువిత్ వుతిసుతిమేతవీ అన్నారు.
ఇది కేవలం థాయ్‌లాండ్ సమస్య కాదు. మన దేశంలో కూడా వీటి వ్యాప్తి బయంకరంగా పెరుగుతుంది. వీటిని అరికట్టే ప్రయత్నం ప్రభుత్వాలు మొదలు పెట్టాలి లేదంటే ఇది ఒక నియంత్రించలేని సమస్యగా మారుతుంది.
Is Tilapia Dangerous to Eat?
Health Risks of Eating Tilapia
Why Tilapia is Bad for You
Tilapia Fish Dangers
Tilapia and Mercury Levels
Tilapia Health Concerns
Tilapia Side Effects
Why Avoid Tilapia Fish?
Tilapia Farmed Fish Dangers
Is Tilapia Safe for Health?
5 Big Reasons Why You Should Never Eat Tilapia
Danger of Tilapia for the Environment
