What are the most mysterious things that science cannot solve?
డేజావు(Deja vu):
మనలో చాలా మందికి ఏదో ఒక సమయంలో ఒక సందర్భం ఇంతకముందే గతంలో ఎప్పుడో జరిగింది అని అనిపిస్తుంది, అది మనం చేసే పని కావచ్చు లేదా చుట్టుపక్కల పరిసరాలు కావచ్చు.
దీన్నే డేజావు అంటారు. కొంత మంది ఇవి పూర్వజన్మ ఙ్ఞాపకాలు అని నమ్ముతారు. ఇంకొంత మంది భవిష్యత్తులో జరిగేదానికి ఇవి సంకేతాలు అని నమ్ముతారు.
ఈ డేజావు కి కారణం తెలియాలంటే ,ఇది కలిగినప్పుడు మెదడుని పరీక్షించవలసి ఉంటుంది. కానీ ఈ డేజావు అనేది ఏ సమయంలో, ఏ వ్యక్తిలో జరుగుతుందో తెలీదు. అందుకే శాస్త్రీయంగా దీనికి కారణం ఏంటో ఇప్పటివరకు ఎవరికీ తెలీదు.
ప్లసీబో ఎఫెక్ట్(Placebo effect):
రండవ ప్రపంచ యుద్ధ సమయంలో గాయపడిన సైనికులందరికీ పెయిన్ కిల్లర్స్(pain killer) సరిపోయేవి కావు.అప్పుడు హెన్రీ అనే సర్జన్ సైనికులకి తెలీకుండా పెయిన్ కిల్లర్ డబ్బాలో ఉప్పునీరు పోసి వాళ్ళకి ఉప్పునీరు ఎక్కిస్తూ ,పెయిన్ కిల్లర్స్ ఇచ్చినట్లుగా నటించాడు.
విచిత్రంగా సైనికులందరికీ నొప్పి తగ్గిపోయింది.ఉప్పునీరుకి నొప్పిని తగ్గించే గుణం ఏమీ ఉండదు.ఉప్పునీరు ఎక్కించిన తర్వాత,సైనికులకి నొప్పి తగ్గిపోవడానికి కారణం తమకి పెయిన్ కిల్లర్స్ ఎక్కించారని, కాబట్టి తమకి నొప్పి తగ్గిపోతుందని వాళ్ళు పూర్తిగా నమ్మడం. వాళ్ళు అలా నమ్మినందు వలన ,వాళ్ళ మెదడు పెయిన్ కిల్లర్ తీసుకుంటే ఎలా స్పందించాలో అలా స్పందించింది. దీనినే ప్లసీబో ఎఫెక్ట్ అంటారు.
ఈ ప్లసీబో ఎఫెక్ట్ ద్వారా గుండెజబ్బులు ,కాన్సర్ వంటి పెద్ద పెద్ద జబ్బుల లక్షణాల నుంచి ఉపశమనం పొందినవారు కూడా ఉన్నారు. కాని ఈ ప్లసీబో ఎఫెక్ట్ కి కారణం ఏంటో ఇప్పటివరకు తెలియలేదు.
వావ్ సిగ్నల్(Wow signal):
ఓహియో యూనివర్సిటీ లోని బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ 1973 లో గ్రహాంతరవాసుల గురించి తెలుసుకోవడం కోసం ,అంతరిక్షం నుంచి వచ్చే సిగ్నల్స్ ను అందుకోవడానికి ఇది నిర్మించబడింది.
1977లో ఖగోళ శాస్త్రవేత్త అయిన జెర్రీ(Jerry),దాన్నుంచి వచ్చిన డేటాలో ఆరు క్యారక్టర్స్ కలిగిన ఒక ప్రత్యేక సీక్వెన్స్ ని గమనించాడు. ఈ సీక్వెన్స్ డీప్ స్పేస్ నుంచి సూటిగా భూమి మీదకి వచ్చింది. దీనిని వావ్ సిగ్నల్ అంటారు.చాలా మంది ఈ సిగ్నల్ ని మనకి గ్రహాంతరవాసులు పంపారు అని అంటుంటారు. కాని ఇప్పటివరకు ఇది ఎవరు పంపారో ఎవరికీ తెలీదు.
హమ్ డింగర్(Humdinger):
ప్రపంచంలో చాలా మందికి తక్కువ ఫ్రీక్వెన్సీ గల శబ్దం తరచూ వినిపిస్తూ ఉంటుంది. దీనినే హమ్ డింగర్ అంటారు.ఈ శబ్దం వినడానికి చాలా చిరాకుగా ఉంటుందట. న్యూజిల్యాండ్,కనడా మరియు ఇంగ్లన్డ్ లో ఈ శబ్దం వినే వారి సంఖ్య ఎక్కువ వుంది. అయితే అసలు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో,కేవలం కొంత మందికి మాత్రమే ఎందుకు వినపడుతుందో ఎవరికీ తెలీదు.
ఇలా చెప్పుకుంటూ పోతే సైన్స్ పరిష్కరించలేని మర్మమైన విషయాలు చాలానే ఉన్నాయి.
గమనిక : ఈ ఆర్టికల్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది. ఈ సమాచారాన్ని TeluguBucket.Com ధృవీకరించడం లేదు. ఈ పోస్ట్ తో మీకేమైనా ఇబ్బంది కలిగినట్లైతే తెలుగు బకెట్ టీం ని సంప్రదించండి. ఈమైల్ – admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.