Menu Close

Telugu Ghost Stories – Telugu Horror Stories – Part 5

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Ghost Stories – Telugu Horror Stories – దెయ్యాల కథలు – హర్రర్ కథలు

“అవును రా మామ, ఇప్పుడు నేను ఏమి చేయాలి” అని అడుగుతాడు రఘు…

“మనం అందరం కలిసి నువ్వు చూసిన వన్నీ నిజాలు అవును కాదో తెలుసుకొనాలి… అంటే దానికోసం మన మిత్రులందరూ కలిసి మళ్లీ అమావాస్య నాడు అర్ధరాత్రి అక్కడికి వెళ్ళి చూద్దాం.నువ్వు ఒక 100 అడుగులు ముందు ఉంటావు.నిన్ను అనుసరిస్తూ మేమందరం వస్తాం.అది దయ్యమో కాదో అక్కడ నువ్వు చూసింది ఏమిటి అనే విషయం మనకి తెలిసిపోతుంది ” అని అంటాడు సురేష్.

“ఓకే మామ నువ్వు అన్నది అంత బాగుంది.నాకేదో భయంగా ఉందిరా.. దయ్యంతో ఆటలు అవసరమంటావా”

“నువ్వు భయపడి,మన ఇజ్జత్ తీయకు. అయినా ఈ కాలంలో దయ్యం అంటే ఎవరు నమ్మరు, అలాంటివేమీ ఉండవు. నువ్వు భయపడకు.”

రఘు : మరి నాకు లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి ఎవరు? నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు..”

Scariest Telugu ghost stories Horror Stories in Telugu Bucket 3

సురేష్ : “తను కూడా దయ్యమే కావచ్చు కానీ కొంచెం జాలి కలిగిన దయ్యం, అందుకే బహుశః నిన్ను ఏమీ చేయకుండా, లిఫ్ట్ ఇచ్చి మరి విడిచిపెట్టింది ఇంకోసారి దొరక్కు….కొన్ని అత్మలకూ నచ్చిన వ్యక్తులు దొరికితే ఏమీ చేయకుండా వదిలేస్తాయ్ అంటా.ఆ ఆత్మకు నువ్వు నచ్చావు కావచ్చు అది నిన్ను విడిచి పెట్టదు” అని భయపెడతాడు సురేష్..

అరేయ్ , భయపెట్టాకురా అని అంటాడు రఘు.

ఒకే మామ. ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళు.ఎల్లుండి కదా అమావాస్య, నేను ఈ విషయాన్ని మన ఫ్రెండ్స్ తో చెపుతాను. వాళ్లకు కూడా ఒక త్రిల్లింగ్ ఉంటుంది..అని చెప్పి సురేష్ రఘుకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు.

రఘు కూడా ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరుతాడు. రఘు ఇంటికి వచ్చే దారిలో, ఆ రోజు రాత్రి కనబడ్డ అమ్మాయి కార్ లో వెళుతుంది. రఘు చూసి ఆశ్చర్యానికి గురి అవుతాడు. “బహుశా ఈమె ఆత్న కాదు అమ్మాయే కావచ్చు” కన్ఫాం చేసుకునేందుకు రఘు ఆమెను ఫాలో అవుతాడు. ఆ కార్ ఒక పెద్ద కంపెనీలో వెళ్లి ఆగుతుంది. ఆరిజిన్ ఆర్గనైజేషన్… అని పేరు కనబడుతుంది. ఆ అర్ధరాత్రి ఆ అమ్మాయి చెప్పిన కంపెనీ పేరు ఇదే. తను ఇందులోనే పనిచేస్తుంది అని కూడా చెప్పింది. లోపలికి వెళ్లబోతుంటే వాచ్మెన్ ఆపుతాడు.

“అగు బాబు,ఎటు వెళ్తున్నావు పర్మిషన్ ఉందా?”అని అంటాడు వాచ్మెన్.

“తను మాకు కావల్సిన వ్యక్తి .నేను తనను కలవాలి..వెళ్లనివ్వు మిస్టర్”…అని అంటాడు రఘు.

“అవునా,అయితే మీరు ఇలా అడగాల్సిన పనిలేదు వాళ్లే నాకు చెప్తారు కదా..మీకు ఎలాంటి పర్మిషన్ లేదు మీరు వెళ్ళండి సార్ నసపెట్టకుండా”

రఘు :”అరేయ్ ,తను మాకు తెలిసిన వాళ్ళు అని చెప్తున్నాను కదా…” కొంచెం అరుస్తూ… వాచ్ మెన్ పై..

“అయితే తను మీకు ఏమవుతారు,”

“కాస్త ఆలోచించి, ఫ్రెండ్ అని అంటాడు…”

“మేడం గారి ఫ్రెండ్స్ అందరు నాకు తెలుసు.. తన ఫ్రెండ్స్ ఎవరు తన పర్మిషన్ లేకుండా ఇక్కడికి రారే మరి”

“మీరు మేడంకి ఫోన్ చేసి చెప్పండి మిమ్మల్ని పంపిస్తాను నిరభ్యంతరంగా..” … “ఏంటి బాబు ఆలోచిస్తున్నావ్ ఫోన్ చెయ్..”అని గద్దిస్తాడు వాచ్మెన్

రఘు : “అది..ఫోన్ నంబర్ లేదు.మీరే ఇవ్వండి..”

“ఏంటి తమాషాలు చేస్తున్నావా.నంబర్ లేదు.ఎం లేదు…అసలు ఆ అమ్మాయి గారు ఎవరో నీకు తెలుసా…”

రఘు, వాచ్మెన్ మాటలకి తెల్లబోయి నిల్చోని, రఘు : “ఎవరు తను?” అని అడుగుతాడు.

“అరిజీన్ ఆర్గనైజేషన్ కి కాబోయే సీఈఓ ,తన పేరు సౌజన్య రెడ్డి”

రఘు అలాగే షాక్ తో వింటాడు..

“ఆ అమ్మాయి (సౌజన్య రెడ్డి) కార్ దిగి,వెనుక తిరిగి చూస్తుంది రఘుని.కాని తను ఎవరో తెలియనట్టు , పలకరించకుండా వెళ్ళిపోతుంది.”

“మేడం నిన్ను చూసి కూడా పిలువలేదు అంటే నువ్వు ఎవరో తెలీదు ఇక్కడి నుంచి వెళ్ళిపో చూస్తే మళ్ళీ నన్ను తిడతారు..”అంటూ వాచ్మెన్ రఘుని నెట్టేస్తాడు బయటికి

రఘు అక్కడి నుండి ఇంటికి వెళ్ళి పోతాడు. ఇంట్లో వెళ్ళిన తర్వాత బాగా ఆలోచిస్తాడు. అమ్మాయి ఉంది నిజమే?ఈమె ఒకే…ఆ బీచ్ లో దయ్యం ఉంది..అది కూడా నిజమే… అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు ఇందులో ఎవరు దెయ్యం? ఎవరు మనిషి? అర్థం కాక బుర్ర పిచ్చెక్కిపోతుంది దేవుడా.ఆ అమ్మాయి ఎందుకు నన్ను చూసి చూడనట్టు, తెలియనట్టు చూసి వెళ్ళిపోయింది. అలాగే ఆలోచనల్లో మునిగి పోయి ఉన్నప్పుడు ఫోన్ కి మెసేజ్ వచ్చింది,దాంతో రఘు ఒకసారి మొబైల్ తీసి చూస్తాడు.అప్పటికే సాయంత్రం అవుతుంది.

ఎవరో “హాయ్..!! హౌ ఆర్ యు డియర్ అని మెసేజ్ వచ్చింది”

రఘు : ఎవరు మీరు ? అని మెసేజ్ చేస్తాడు.

అవతలి వైపు నుండి, “నేను నిన్న రాత్రి నీకు లిఫ్ట్ ఇచ్చాను.ఆ అమ్మాయే నేను…”

రఘు : నా నంబర్ ఎలా దొరికింది..

అమ్మాయి : “నేను అనుకుంటే ,ఎవ్వరి నంబర్ అయినా దొరుకుతుంది..”

రఘు : హో ఒకే, కాబోయే సీఈఓ అంటే ఆ మాత్రం ఉంటుంది అని తనలో తాను అనుకోని….. “నేను మీ ఆఫీస్ కి వచ్చా..నువ్వు నన్ను చూడలేదా…”

అమ్మాయి: “అవునా, ఐ యాం సోరీ,నేను నిన్ను గమనించలేదు..”

రఘు : కెన్ ఐ కాల్ యూ…

అమ్మాయి : “వద్దు ,అమ్మ నాన్న ఉన్నారు.నేను ఇంట్లో ఉన్నాను.నేను మళ్ళీ నీతో మాట్లాడుతాను బాయ్” అని మెసేజ్ చేస్తుంది.

రఘుకి ఏదో తెలియని నిరాశ ఆవరించిన, ఆ అమ్మాయి కనబడింది మరియు మెసేజ్ చేసింది అన్న సంతోషం తనకు కలిగింది.తన మనసులో ఎలాగైనా ఒకసారి ఆ అమ్మాయిని కలవాలని నిర్ణయించుకుంటాడు.

రఘు సురేష్ కి ఫోన్ చేసి, అరేయ్ మామ,ఆ అమ్మాయి కనపడింది రా..అదే రా..అర్ధరాత్రి నాకు దేవతలా లిఫ్ట్ ఇచ్చింది..ఆ అమ్మాయిని చూసాను.తను నాకు మెసేజ్ కూడా చేసింది…అని అన్ని విషయాలు చెప్పేస్తాడు.

“అవును,సూపర్,తను ఎవరో పూర్తి విషయాలు తెలుసుకున్నావా..”మళ్ళి తర్వాత దయ్యం అంటావా”..అంటాడు సురేష్..

“అదేం లేదు రా,తను మనిషే..”

“ఒకే ఎల్లుండి బీచ్ కి వెళ్ళాలి. రెఢీగా ఉండు.నేను మన అందరి ఫ్రెండ్స్ కి కూడా విషయం వివరించాను.వాళ్ళు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు దయ్యాన్ని చూడటానికి.నువ్వు నీ దయ్యాన్ని చూపించడానికి రెడీ గా ఉండు”

రఘు : “అరేయ్.నువ్వు మరీ ఎక్కువ భయ పెడుతున్నవు..”

సురేష్ : సర్లే కాని రేపు ఆఫీస్ లో మన ప్రాజెక్టు, గవర్నమెంట్ టెండర్ లో సెలెక్ట్ అయి మన కంపెనీకి ప్రాజెక్ట్ వస్తుంది.పార్టీ చేసుకోవడానికి మంచిగా రెడీ అయిరా..

రఘు : ప్రాజెక్ట్ మనకు వస్తుందని గ్యారెంటీ ఏంట్రా…

సురేష్ : “దానిని తయారుచేసింది ఎవరు? ది గ్రేట్ రఘు వరుణ్, బి టెక్…చూడ్డానికి పిరికొడే అయినా ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే తిరుగుండదు.ఇంతకు ముందు కూడా 2 ప్రాజెక్ట్ లు కూడా నువ్వు డిజైన్ చేసినవే.అప్పుడు కంపెనీకి చాలా కోట్లు లాభాలు వచ్చాయి.అదే నమ్మకం నాకు ఇప్పటికీ కూడా ఉంది.తప్పకుండా ప్రాజెక్ట్ మనకే వస్తుంది.”

అలా ఇద్దరు మాట్లాడుకొని,రేపు ఉదయం ఆఫీస్ కి బయలుదేరుతారు.ఆ టెండర్ లో వారికి ప్రాజెక్ట్ అనుకున్నట్టే వస్తుంది.ఆఫీస్ స్టాఫ్ అందరికీ పార్టీ ఇస్తాడు బాస్,అలాగే రఘుని అభినందిస్తాడు.

ఈవెనింగ్ సురేష్ మరియు రఘు ఇద్దరు షాపింగ్ చేయడానికి కళా మందిర్ షాపింగ్ మాల్ కి వెళ్తారు . అదే సమయానికి ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మతో అక్కడికి షాపింగ్ కి వస్తుంది.

Scariest Telugu ghost stories Horror Stories in Telugu Bucket 2

రఘు ఆ అమ్మాయిని చూస్తాడు.చాలా సంతోషంతో సురేష్ కి కూడా చూపిస్తాడు.

షాపింగ్ మాల్ లో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో కలిసి షాపింగ్ చేయడం మొదలుపెట్టింది. వెంటనే రఘు ఉత్సాహంతో వెనక నుండి వెళ్లి,

“హాయ్ సౌజన్య రెడ్డి గారు, అని అంటాడు మీరు నాకు డైరెక్ట్ గా కలుస్తారు అని నేను అనుకోలేదు వాటే కోఇన్సిడెన్స్ కదా..అని అంటాడు రఘు..

ఆ అమ్మాయి “ఎవ్వరూ మీరు అని అడుగుతుంది.? మీరు నన్ను చూసి మరెవరో అనుకొని పొరబడుతున్నారు.నా పేరు సుహాసిని ,సౌజన్య రెడ్డి కాదు.” అని చెప్పగానే రఘు షాక్ అవుతాడు.

“అదేంటి? ఆ రోజు రాత్రి మీరు నన్ను స్కూటీ మీద డ్రాప్ చేశారు.అలాగే నిన్న నాతో చాటింగ్ చేశారు అంటూ” మెసేజెస్ కూడా చూపిస్తాడు

“మీరు పోరపడుతున్నారు.నాకు స్కూటీ లేనే లేదు.ఎప్పుడు కార్ లోనే వెళ్తాను మరియు ఈ మెసేజెస్ నావి కావు “

ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ “ఎవరు ఈ అబ్బాయి “అని అడుగుతుంది తనను

అమ్మాయి : ఎవరినో చూసి నన్ను అనుకుంటున్నాడు అమ్మా! పద మనం వెళ్దాం.

రఘు షాక్ లో ఉండిపోతాడు. ఎంటి ఈ అమ్మాయి!ఇలా అంటుంది? నిజంగా తన పేరు సుహాసినే కావచ్చు.పక్కనే వాళ్ళ అమ్మ కూడా ఉంది కాబట్టి నాకు అబద్ధం చెప్పే అవకాశం లేదు. మరి ఆ అమ్మాయి ఎవరు? వీరు ఒక్కరా ఇద్దరా?ఏమి అర్థం కావట్లేదు.రూపం చూస్తే ఒకేలా ఉంది.స్కార్ఫ్ లో ఉండి నేనే సరిగ్గా చూడలేదు కావచ్చు అని..అనుకుంటాడు.

సురేష్ : “ఏంట్రా రఘు. అమ్మాయి అన్నావు? చాటింగ్ అన్నావు? తీరా వచ్చి చూస్తే నీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.”

రఘు : “నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోవడానికి తను నా గర్ల్ ఫ్రెండ్ ఏమి కాదు. జస్ట్ కలిసి ఒకసారి థాంక్స్ చెప్పాలని…అంతే..”

సురేష్ : “ఆ అమ్మాయి మాటలు వింటుంటే ఆమె చెప్పింది నిజమే అని నాకు అనిపిస్తుంది..”

రఘు : “మరి నాకు వాచ్మెన్ అబద్ధం చెప్పాడు అంటావా? మరి వాడికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? మరి నాకు మెసేజ్ చేసింది ఎవరు? అయ్య బాబోయ్ నాకు ఏమీ అర్థం కావడం లేదు…”

సురేష్ : మామ ఒకసారి కాల్ చేయరా ఆ నెంబర్ కి

రఘు : ఇప్పుడు ఎందుకు రా?

Scariest Telugu ghost stories
Most haunted places in Andhra Pradesh
Real ghost stories from Telangana
Telugu ghost stories that will make you shiver
Telugu ghost stories that will keep you up at night
Telugu ghost stories that will make you believe in the paranormal
Telugu ghost stories that will change your life
Telugu ghost stories that will make you laugh
Telugu ghost stories that will make you cry

మురళీ గీతం – 8374885700

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading