ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kammukunna Chikatlona Song Lyrics In Telugu – కమ్ముకొన్న చీకట్లోన
కమ్ముకొన్న చీకట్లోన… కుమ్ముకొచ్చే వెలుతురమ్మ
గచ్చకట్టి కత్తిపడితే… చిచ్చురేపే కాళివమ్మ
నీ కన్ను ఉరిమి చూడగానే… దూసిన కత్తి వణికిపోవునమ్మ, జేజమ్మా
కుంచెపట్టి బొమ్మగీస్తే… అదే నీ గుండెకే అద్దమమ్మ
అందరిని ఆదరించే దయామయి… అన్నపూర్ణ నీవమ్మ
ఆలన పాలనలో నువ్వే ఈ నేలకు తల్లివమ్మ
నువ్వు రుద్రరూపమెత్తగానే… కాలమే దద్దరిల్లిపోయెనమ్మా
క్షుద్రశక్తులకు నీ ధాటితో… గుండెలే బద్దలైపోయెనమ్మా
బుస కొట్టే కామాందుని… కసితీరగ తొక్కావమ్మా
పుట్టు గడ్డనే ఆదుకున్న… ఆ అపరభద్రకాళి నీవమ్మా
మాట నిలుపుకుంటివమ్మ… జేజమ్మా మళ్ళీ జన్మ ఎత్తినావమ్మా
ఎంత దీక్ష పూనినావమ్మ… గుండెలో నిప్పులే నింపినావమ్మా
త్యాగమంటె నీదమ్మ… నరకమే కొంగులోన ముడిచావమ్మా
నిన్ను చూసి మృత్యువుకే జేజమ్మా… కళ్ళు చెమ్మగిల్లినాయమ్మా
ఈ జారుతున్న రక్తధారలే… నీ తెగువకు హారుతులు పట్టెనమ్మా
దిక్కులన్నీ శూన్యమాయే… వెలుతురంతా చీకటాయే
ఆశలన్నీ ఇంకిపోయే… శ్వాస మాత్రం మిగిలిపోయే.. ..
Kammukunna Chikatlona Song Lyrics In Telugu – కమ్ముకొన్న చీకట్లోన