Gummadi Gummadi Lyrics In Telugu – Daddy – గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి… డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి
చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి… మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి…
వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి… ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి…
చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి… పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి…
గుమ్మాడి గుమ్మాడి… ఆడిందంటే అమ్మాడి…
డాడీ ఊపిరిలో… మురిసే కూచిపూడి…
నా తల్లివి నువ్వో… నీ తండ్రిని నేనో…
ఎవరినెవరు లాలిస్తున్నారో ఓ ఓ…
చిత్రంగా చూస్తుంటే నీ కన్న తల్లి… పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి…
గుమ్మాడి గుమ్మాడి… ఆడిందంటే అమ్మాడి…
డాడీ ఊపిరిలో… మురిసే కూచిపూడి…
వర్షంలో తడిసొచ్చి… హాయ్ రే హాయ్ అనుకుందామా…
వర్షంలో తడిసొచ్చి… హాయ్ రే హాయ్ అనుకుందామా…
రేపుదయం జలుబొచ్చి… హాచ్చి హాచ్చి అందామా…
ఓ వంక నీకు ఓ వంక నాకు… ఆవిరి పడుతూనే మీ మమ్మీ…
హై పిచ్ లో మ్యూజికల్లే… తిడుతుంటుందే…
మన తుమ్ములు… డ్యూయెట్టల్లే వినపడుతుంటే…
గుమ్మాడి గుమ్మాడి… ఆడిందంటే అమ్మాడి…
డాడీ ఊపిరిలో… మురిసే కూచిపూడి…
వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి… ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి…
చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి… పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి.. ..
Gummadi Gummadi Lyrics In Telugu – Daddy – గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, Fathers Day Special Song in Telugu, Father Love Songs in Telugu
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.