Menu Close

Ninnena Nenu Chusthundi Song Lyrics in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

నిన్నేనా నేను చూస్తోంది… నిన్నేనా
నువ్వేనా నువ్వులా ఉన్న… ఎవరోనా
కోపంలో నిప్పుల కొండలా… రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా… చిన్నారుల చేతికి బొమ్మలా
ఇంతకీ నువ్వొకడివా వందవా… ఎంతకీ నువ్వెవరికీ అందవా

కొత్తగా లవ్ లో పడుతుంటె… కొద్దిగా ఇదిలా ఉంటుందే
ముందుగా మనసుకి తెలుసుందే… ముందుకే నెడుతూ ఉంటుందే
తప్పు కాబోలనుకుంటూనె… తప్పుకోలేననుకుంటుందే
నొప్పిలో తీపి కలుస్తుందే… రెప్పలో రేపు మురుస్తుందే

నిన్నేనా నేను చూస్తోంది… నిన్నేనా
నువ్వేనా నువ్వులా ఉన్న… ఎవరోనా
కోపంలో నిప్పుల కొండలా… రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా… చిన్నారుల చేతికి బొమ్మలా
ఇంతకీ నువ్వొకడివా వందవా… ఎంతకీ నువ్వెవరికీ అందవా

తడవక నడిపే… గొడుగనుకోనా
అడుగుల సడిలో… పిడుగైనా
మగతను పెంచే… మగతనమున్నా
మునివనిపించే… బిగువేనా

ముళ్లలా నీ కళ్లలా… నను గిల్లిపోతున్నవా
పువ్వులా నా సున్నితాన్నే… కాపు కాస్తున్నవా
నాకేమవుతావో చెప్పవ ఇపుడైన…

చెప్పమని అడిగేం లాభంలే… ఎప్పుడో పొందిన ఆన్సర్లే
ఉత్తినే వేసే కొశ్చన్లే… ఊరికే తీసే ఆరాలే
నిదర చెడగొట్టె నేరాలై… కుదురుగ ఉంచని తొందరలే
దరిమిల అంతా నీ వల్లె… అంటు నిలదీసే నిందల్లే

నిన్నేనా నేను చూస్తోంది… నిన్నేనా
నువ్వేనా నువ్వులా ఉన్న… ఎవరోనా

బిత్తరపోయే బెదురుని దించు… కొత్తగ తెగువే కలిగించు
కత్తెర పదునై… బిడియము తెంచు
అత్తరు సుడివై… నను ముంచు

చెంప కుట్టె తేనె పట్టై… ముద్దులే తరమనీ
చెమట పుట్టే పరుగు పెట్టి… హద్దులే కరగనీ
అని అడగాలన్నా… అడిగేయలేకున్నా

చెప్పమని అడిగేం లాభంలే… ఎప్పుడో పొందిన ఆన్సర్లే
ఉత్తినే వేసే కొశ్చన్లే… ఊరికే తీసే ఆరాలే
నిదర చెడగొట్టె నేరాలై… కుదురుగ ఉంచని తొందరలే
దరిమిల అంతా నీ వల్లె… అంటు నిలదీసే నిందల్లే

హో… నిన్నేనా నేను చూస్తోంది… నిన్నేనా
నువ్వేనా నువ్వులా ఉన్న… ఎవరోనా
కోపంలో నిప్పుల కొండలా… రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా… చిన్నారుల చేతికి బొమ్మలా
ఇంతకీ నువ్వొకడివా వందవా… ఎంతకీ నువ్వెవరికీ అందవా
ఇంతకీ నువ్వొకడివా వందవా… ఎంతకీ నువ్వెవరికీ అందవా
నమ్ దనమ్ తననమ్ తందమ్ తమ్………………

Like and Share
+1
1
+1
3
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading