Telugu Moral Stories – తప్పకుండా చదవండి
అనగనగ ఒక అడవిలో కోతుల గుంపు కలసి మెలసి జీవిస్తూ ఉండేవి. కొన్ని రోజుల నుండి వారు కష్టపడి దాచుకున్న ఆహారం మాయం అవుతుంది. ఆహారం ఎలా మయమైపోతోందో అని అన్ని కోతులు కలిసి మాటు వేసి గమనిస్తూ ఉండగా…
ఒక కోతి ఎవరు చూడడం లేదు అనుకుని ఎప్పటిలానే ఆహారాన్ని దొంగిలించి పట్టుకువెళ్తుంది. అక్కడే మాటు వేసిన కోతులు అ కోతిని పట్టుకున్నాయి. అన్ని కోతులు సమావేశం అయ్యి… తీర్పు చెప్పాయి.
నువ్వు నమ్మకం ద్రోహం చేసావు కాబట్టి ఇక నువ్వు అడవిలో ఉండకూడదు. అలాగే దొంగతనం చేసావు కాబట్టి దానికి శిక్షగా అ చెట్టు కింద ఒంటి కాలితో నిలబడాలి లేదంటే ఇంకా పెద్ద శిక్ష విధిస్తాం.
నువ్వు మోసం చేసి ఎటు వెళ్లకుండా రోజంతా నిన్ను గమనిస్తూ నీ దగ్గర మూడు కోతులు ఉంటాయి అంటూ చెప్పి దానిని చెట్టు కింద ఒంటి కాలితో నిలబెట్టాయి. తర్వాత మూడు కోతులు మినహా అన్ని వెళ్లిపోయాయి. ఆలా ఒంటి కాలితో నిలబడి ఉన్న కోతిని పక్క అడవి నుండి వచ్చిన మరో రెండు కోతులు చాలా సేపు నుండి చూడసాగాయి.
ఇంతలో కోతి దగ్గర కాపలాగా ఉన్న మూడు కోతులు అక్కడనుండి వెళ్లిపోతు ఉండడం చూసినా అ రెండు కోతులు.. ఇలా అనుకున్నాయి. బహుశా అ కోతి గొప్పది అయి ఉంటుంది. ఒంటికాలితో ధ్యానం చేస్తుంది. వాటి చుట్టూ ఉన్న కోతులు వాటి శిష్యులు అనుకుంట… ఏదైనా ఆహారం తీసుకు రావడం కోసం వెళ్లి ఉంటాయి.
మనం అ కోతిని కలిసికుని మనతో తీసుకుని వెళ్దాం మనకు ఇలాంటి గొప్ప తెలివైన, జ్ఞానం కలిగిన కోతి మనతో ఉంటే మనకు చాలా మంచిది.. పద అడుగుదాం అనుకుంటూ వెళ్లాయి.
అయ్యా.. కోతిగారు… మీరు ఎంతో గొప్ప వారు… మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాం మీరు కాదు అనకూడదు అంటూ మాట్లాడుతుంటే ఈ కోతికి ఏమి అర్ధం కాలేదు. అయినా చెప్పమంటూ తల ఊపింది.
అ రెండు కోతులు అయ్యా మీరు మాతో వస్తే.. మీకు రోజు మీకు కావాల్సినా ఆహారం అందిస్తాము. మీరు ధ్యానం చేసుకుంటూ మాకు కొన్ని మంచి మాటలు చెప్తూ ఉందురు. మీకు ఎప్పుడు ఈ లోటు రానివ్వము. మాతో రాను అని మాత్రం చెప్పొద్దూ అని చెప్పాయి.
అ మాటలు విన్న కోతి ఒక్కసారిగా ఆశ్చర్యపడి తన అదృష్టం ఇంత బాగుందా అనుకుని మనసులో సంబరపడి.. పదండీ వెళదాం.. నేను జీవిస్తుందే మీ అందరి కోసం అంటూ… అక్కడ నుండి వారితో వెళ్ళింది.
అ రెండు కోతులు అన్ని కోతులను పిలిచి ఈ కోతి చాలా గొప్పది. ప్రతి రోజు తను అందరి కోసం అ దేవుణ్ణి ధ్యానిస్తూ ఒంటి కాలిపై తపస్సు చేస్తు ఉంటుంది. మనం ప్రతి రోజు ఈ చెట్టు దగ్గర ధ్యానంలో కోతి ముందు కూర్చుని ధ్యానం తర్వాత కొన్ని మంచి విషయాలు విని వెళ్దాం అంటూ చెప్పాయి.
అ తర్వాత రోజు నుండి అన్ని కోతులు ఆహారాన్ని సిద్ధం చేసి పెట్టేవి. ఆహారాన్ని కోతి హాయిగా తింటూ….. ఒంటికాలిపై నిలబడి ధ్యానం చేస్తున్నట్టు… కోతుల ముందు నటించేది. అవి వెళ్ళిపోగానే హాయిగా నిద్రించేది.
ఆలా రెండు రోజులు అయ్యే సరికి.. చెట్టు దగ్గరకి అన్ని కోతులు రావడం అక్కడ నుండి వెళ్ళకుండా అక్కడే ఎక్కువ సమయం ఉండడంతో కోతి ఒంటి కాలిపై నిలబడలేక అవస్థలు పడింది. ఇక నటించడం నావల్ల కాదు అంటూ అక్కడ నుండి పారిపోయింది.
నీతి :1. కంటితో చుసినది ప్రతిదీ నిజం అవ్వకపోవొచ్చు. మనం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఏ విషయం అయినా పూర్తిగా తెలుసుకున్నకే నమ్మాలి.
అవగాహనా లేమి… అనార్ధాలకు దారి తీస్తుంది.
నీతి:2. తప్పు… కప్పుకుని మంచి ముసుగు వేసుకున్న వారు ఎవరైనా ఎక్కువ రోజులు అందులో ఉండలేరు. మంచి లేని వారు మంచి ముసుగులో ఇమడలేరు.
Telugu Moral Stories
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.