ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Swathi Muthyapu Jallulalo Lyrics in Telugu – Prema Yuddham
Movie: Prema Yuddham (23 March 1990)
Director: S.V.Rajendra Singh Babu
Singers: S P Balasubramanyam, S Janaki
Music: Hamsalekha
Lyrics: Veturi, Acharya Atreya
Star Cast: Nagarjuna Akkineni, Amala, Mohan babu
Producer: P.Vijaya Kumari
Music Lable: T-Series Telugu
స్వాతీ ముత్యపు జల్లులలో… శ్రావణ మేఘపు జావళిలో

నిండే దోసిలి, పండే కౌగిలి… నిన్నే అడిగెనులే
నీతో రాతిరి, గడిపే లాహిరి… నిన్నే కడిగెనులే
ఆ ఆఆ… ఆఆ ఆఆ… ఆ అహా హా ఓ ఓ… ఓహోహొ

ముసురేసిందమ్మా..!
కబురే కసిగా తెలిపీ… తడిగా ఒడినే దులిపీ
జడివానేం చేస్తుందీ… జవరాలే తోడుంటే…
తడిపేసిందమ్మా..!
తనువూ తనువూ కలిపీ… తనతో సగమే చెరిపీ
చలిగాలేం చేస్తుందీ… చెలికాడే తోడుంటే…
ఆ మెరుపులకే మెలితిరిగే సొగసులతో…
ఈ ఉరుములకే… ఉలికి పడే వయసులతో
కురిసిందీ వానా తొలిగా పరువానా…
స్వాతీ ముత్యపు జల్లులలో… శ్రావణ మేఘపు జావళిలో
నిండే దోసిలి, పండే కౌగిలి… నిన్నే అడిగెనులే
నీతో రాతిరి, గడిపే లాహిరి… నిన్నే కడిగెనులే
లా ల్లలా లా ల్లలల్లా… లా లా
లా ల్లలా లా ల్లలల్లా… లా లా
మతిపోయిందమ్మా..!
మనసు మనసు కలిసి… కథలు కళలు తెలిసీ
జలపాతం నీవైతే… అల గీతం నేనే లే…
కసిరేగిందమ్మా..!
కలతో నిజమే కలిసీ… దివిని భువినీ కలిపీ
సిరి తారలు తెస్తాలే… నీ విరులే చేస్తాలే
ఈ చిటపటకే శృతి కలిసే వలపులతో…
ఈ తపనలకే జత కలిసే తలపులతో…
కురిసిందీ వానా… తొలిగా పరువానా