అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Precautions to Take in Summer – Health Tips in Telugu

Health Tips in Telugu
రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిదని హైడ్రేట్‌గా ఉండొచ్చని సూచిస్తున్నారు.
వేసవిలో పెరుగు, మజ్జిగను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని పోషకాలు కొన్ని ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. కావున ఆహారంలో మజ్జిగను తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.
కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో శరీర శక్తిని పెంచడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడే గుణాలు చాలా ఉన్నాయి. ఇది రక్త ప్రసరణను సమతుల్యంగా ఉంచడంతోపాటు డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది
వేసవికాలం పండ్లలో ముఖ్యంగా గుర్తొచ్చేది పుచ్చకాయ. ఎండాకాలంలో పుచ్చకాయ తినడం చాలామంచిది. దీనిలో ఎక్కువ నీరు ఉంటుంది. దీనివల్ల శరీరానికి మేలు జరుగుతుంది.

మిరపకాయ గురించి చాలా మందికి తెలియదు. వేసవిలో మిరపకాయలను ఆహారంతోపాటు తినడం మంచిది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
వేసవి కాలంలో ముఖ్యంగా కర్బూజ తినడం, జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. ఇది రుచిగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కర్బూజాలో నీరు, పీచు పుష్కలంగా ఉంటుంది. వేసవిలో ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పనిచేస్తుంది. దీంతోపాటు ఇది యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

కర్బూజ జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలు
హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది: కర్బూజ కాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. దీనిని తినడం వల్ల రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. డీహైడ్రేషన్ కారణంగా కిడ్నీలో రాళ్లు, తల తిరగడం, తలనొప్పి, మలబద్ధకం, పొడి చర్మం మొదలైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కావున దీనిని తినడం మంచిది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: కర్బూజ జ్యూస్ లో బీటా కెరోటిన్ ఉంటుంది. బీటా కెరోటిన్ విటమిన్ ఎగా మారి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: కర్బూజ ఫలం ఫోలేట్‌కి మంచి మూలం. దీనిని విటమిన్ బి-9 అని కూడా అంటారు. ఇది కొన్ని క్యాన్సర్ల ప్రమాదం నుంచి కూడా రక్షిస్తుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది: దోస జాతికి చెందిన కర్బూజ కాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధించి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.
సమృద్ధిగా విటమిన్లు, ఖనిజాలు: కర్బూజ కాయలో విటమిన్ కె, నియాసిన్, కోలిన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, రాగి, మాంగనీస్, సెలీనియం మొదలైన అనేక విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి.
గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.
6 Health Tips in Telugu – 6 Summer Safety Tips – Beat the Heat – Precautions to Take in Summer, హెల్త్ టిప్స్, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రతలు..