Menu Close

Yemito Ivala Rekkalochinattu Lyrics In Telugu-Andala Rakshasi

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

శపించని నన్ను నా గతం… ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనట! ఇక పై నా జీవితం శాపమైనా, వరంలా తోచెనే ఈ క్షణం…

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా…
ఆకాశమంచు తాకుతున్న గుండెనే… కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే
మనసు నవ్వే మొదటిసారి…
ఏం మార్పిది ఎడారి ఎండమావి… ఉప్పెనై ముంచెనే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే… ఏ ఏ ఏ

ఆగని ప్రయాణమై… యుగాలుగా సాగిన
ఓ కాలమా…
నువ్వే ఆగుమా… తనే నా చెంతనుండగా
తరమకే ఓ దూరమా…
నువ్వే లేని నేను లేనుగా… లేనే లేనుగా
లోకాన్నే జయించినా… నీ ప్రేమ వల్ల
పొందుతున్న హాయి ముందు ఓడిపోనా…
జారిందిలే ఝల్లుమంటూ… వాన చినుకు తాకి
తడిసిందిలే నాలో ప్రాణమే…
ఈ బాధకే ప్రేమన్న మాట… తక్కువయిందిగా

గుండెలో చేరావుగా ఉచ్ఛ్వాసలాగ… మారకే నిశ్వాసలా
నీకే న్యాయమా… నన్నే మార్చి ఎరుగనంతగా
నువ్వలా ఉన్నావెలా
నిన్నల్లోనె నిండిపోకలా… నిజంలోకి రా
కలలతోనే కాలయాపన… నిజాల జాడ నీవే అంటూ
మెలకువై కలే చూపే

ఏం మార్పిది… నీ మీద ప్రేమ పుట్టుకొచ్చె
ఏం చెయ్యనూ… నువ్వే చెప్పవా
ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా…

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు… వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న కళ్లు… చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి… ఉప్పెనై ముంచెలే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే…

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading