యాగంటి బసవయ్య లేచి రంకె వేస్తే కలియుగం అంతమవుతుందని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఉంది… బసవయ్య అంటే శివుడి వాహనమైన నందీశ్వరుడు…. ఈ క్షేత్రనంది విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది.. ప్రతి ఇరవై సంవత్సరములకు ఒక అంగుళం పెరుగుతాడు ( ఇది ఒడ్డు, పొడుగు, ఎత్తు అన్ని వైపులా) …
ఈ విధంగా పెరిగే సరికి ప్రస్తుతం ఈ నంది మండపం పరిధిని దాదాపుగా ఆక్రమించుకుంది.. మొదట మండపం మధ్యలో ఉండి చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా ఉండేదట… ఇప్పుడు పూర్తిగా ఆక్రమించి.. స్తంభాలలో సరిపోవటం లేదు… దీనిని పురావస్తు శాస్త్రజ్ఞులు నిర్థారించారు… చిత్రంలో చూడండి.. ఇది నిజంగా ఎంత అద్భుతం …
ఈ క్షేత్రంలో ఇంకా చాలా మహిమలున్నాయి..
1. మొదట వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని మొదలు పెట్టి విగ్రం తయారయ్యే సమయానికి స్వామి వారి కాలి బొటనవేలిలో లోపం గమనించారట… ఈ లోపల గుడి కట్టించే రాజు కలలో ఈశ్వరుడు కనిపించి … ఇక్కడ నా విగ్రహం ప్రతిష్టించు… అని అదేశించాడట… ఇక్కడ ఉన్న శివ లింగం లోనే శివుడు.. పార్వతి ఇద్దరు ఒకే లింగంలో దర్శనమిస్తారు … ఈ క్షేత్రంలో ఇది ఒక ప్రత్యేకత…
2. అగస్త్య మహాముని ఈ క్షేత్రంలో యాగం చేసేటప్పుడు రాక్షసులు కాకి రూపంలో వచ్చి మాసం ముక్కలు యాగాగ్నిలో వేస్తున్నారని కాకులు ఈ క్షేత్రంలో తిరగరాదని… అగస్త్యుడు శాపమిచాడట… అందుకే ఈ క్షేత్రంలో కాకులు ఉండవు…. (అగస్త్యుని యాగం వలన ఖ్యాతి చెందింది కాబట్టి ఊరు పేరు యాగంటి అయిందని ఒక వినికిడి )
3. శని వాహనం కాకి … ఇక్కడ కాకిని నిషేధించారు కాబట్టి ఇక్కడ నేను ఉండను… అని అయన చెప్పాడంట… అందుకే ఈ గుడిలో నవగ్రహాలు ఉండవు…. ఆ ప్రదేశం లో నందీశ్వరుడు ఉంటాడు…
4. ఈ గుడిని మొదట వెంకటేశ్వర స్వామి కోసం మొదలు పెట్టారు కాబట్టి… ఈ ఆలయం నిర్మాణం విష్ణు ఆలయాల మాదిరి ఉంటుంది…తయారు చేసిన వెంకటేశ్వరస్వామిని ఒక గుహలో ఉంచారు…
5. కోనేరు లో కోనేరులో నీరు ఎక్కడ నుండి వస్తుందో… తెలియదు…సంవత్సరం లో 365 రోజులు నీరు ఉంటుంది…
6. నీరు గుడి బయటకు వచ్చిన తర్వాత మాయమవుతుంది… అది ఎక్కడకు వెళ్తుందో తెలియదు… అక్కడ బోర్ వేసిన చుక్క నీరు కూడా పడదట… ఈ క్షేత్రం గురించి కేవలం మాటలలో మాత్రమే కొంచెం వివరించాను… నా అధ్యమిక అనుభూతిని మీకు చూపించలేను… జీవిత కాలంలో ఒకసరయిన చూడదగిన క్షేత్రం యాగంటి…కర్నూలు జిల్లా, బనగానపల్లెకు ఐదు కి.మీ దూరంలో ఉన్నది ఈ క్షేత్రం…
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.