ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Budget 2024-25 ప్రకారం ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే – What’s cheaper and costlier?
ఎన్డీయే సర్కార్ పార్లమెంట్లో ఈ రోజు(జులై 27 2024) ఫుల్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. వరుసగా ఏడోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
అయితే కేంద్ర బడ్జెట్ లో బీహార్, ఏపీ, మినహా మిగతా రాష్ట్రాలకు పెద్దగా ఒరిగిందేమి లేదు. దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇది ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు పెట్టిన బడ్జెట్ అని ఇండియా కూటమి నేతలు విమర్శిస్తున్నారు.
బడ్జెట్ లో భాగంగా. భారతదేశంలో మొబైల్ ఫోన్ తయారీని పెంచే ప్రయత్నంలో.. కెమెరా లెన్స్ లతో సహా వివిధ భాగాలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తున్నట్లు నిర్మలాసీతారామన్ ప్రకటించారు. అంతేకాకుండా.. ఫోన్‌లు , ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లిథియం-అయాన్ బ్యాటరీలపై పన్ను రేటును కూడా తగ్గించారు. ఈ విధాన మార్పు భారతదేశంలో ఫోన్‌లను తయారు చేసే కంపెనీల సంఖ్యను పెంచుతుందని, దీంతో.. ధరలు తగ్గుతాయి.
ధరలు పెరిగే వస్తువులు
ప్లాటినం వస్తువులు
కాంపౌండ్ రబ్బరు
కాపర్ స్క్రాప్
సిగరెట్
1.అమ్మోనియం నైట్రేట్‌పై 10% కస్టమ్స్ సుంకం,
2.నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్‌కు 25% పెంపుదల కూడా బడ్జెట్‌లో ప్రకటించారు. అంటే.. ప్లాస్టిక ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ 25శాతం పెరగనున్నాయి.
3.టెలికాం పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 15శాతానికి పెంపు
ధరలు తగ్గే వస్తువులు
బంగారం, వెండి , వజ్రాల ఆభరణాలు
ఎలక్ట్రిక్ వాహనాలు
లిథియం బ్యాటరీలు
మొబైల్
సైకిల్స్
ఆర్టిఫిషియల్స్ వజ్రాలు
బొమ్మలు
క్యాన్సర్ మెడిసిన్స్
1.మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై పన్నును దాదాపు 15 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు.
2.బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినం పై 6.4 శాతానికి తగ్గించారు.
3.క్యాన్సర్ చికిత్స మందులు, ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించారు.
4.ఫెర్రో నికిల్, బ్లిస్టర్ కాపర్ పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
5.చౌకగా లభించనున్న లెదర్ వస్తువులు, సీఫుడ్
షేర్ చెయ్యండి.