అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
What Causes Excessive Yawning in Telugu?
చాలా మంది ఎక్కువుగా అలసిపోవడం వలన ఆవలింతలు వస్తాయి నమ్ముతారు. మీరు ఎప్పుడైనా ఒక ముఖ్యమైన మీటింగ్‌లో ఆవలింతాలు రావడం వాటిని మీరు ఆపుకోవడానికి ప్రయత్నించడం. మీరు ఆవలిస్తే, ఇతరులు మిమ్మల్ని అగౌరవంగా చూడడం జరుగుతుంది. నిజానికి ఆవలించడం గురుంచి వారికి సరిగ్గా తెలిస్తే, అర్దం చేసుకుంటారు.
ఈ అవలింతలు కేవలం మీ అలసటను తెలియ చేయడమే కాకుండా అంతకంటే ఎక్కువ చెబుతూ ఉండవచ్చు. సాధారణ శారీరక పనితీరు నుండి తీవ్రమైన ఆరోగ్య సమస్యల వరకు.

Reasons for Yawning ? ఆవలింతలకి కొన్ని కారణాలు:
ఆవలింతలు మీ శరీరం యొక్క సహజ రేడియేటర్ వ్యవస్థగా పని చేస్తుంది. మీ మెదడు ఎక్కువు వత్తిడికి లోనవ్వడం వలన వేడికి గురి అవుతుంది. అప్పుడు ఆవులించినప్పుడు లోతైన శ్వాస తీసుకోవడం జరుగుతుంది దాని వల్ల మెదడు వేడి రక్తాన్ని మెదడు నుండి ఇతర బాగాలకు పంపి ఊపిరితిత్తుల నుండి చల్లటి గాలిని పైకి తీసుకువస్తుంది. వ్యాయామశాలలో ఎక్కువుగా ఆవలించే వ్యక్తులను చూస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు, ఇది కేవలం వారి శరీరాన్ని చల్లబరచడానికి.
మీరు అలసటగా వున్నప్పుడు, మీకు తగినంత నిద్ర లేనప్పుడు, మీ మెదడు ఉష్ణోగ్రత పెరుగుతుంది, కాబట్టి మీరు దానిని చల్లబరచడానికి ఆవలించవచ్చు. మెదడు చల్లబరుస్తుంది కాబట్టి ఇది కొంచెం మెరుగ్గా దృష్టి పెట్టడంలో మీకు సహాయపడుతుంది. నిద్ర లేకపోవడం వల్ల మీకు ఆవలింతలు ఎక్కువగా వస్తుంటే, మీరు ఏమైనా నిద్ర లేమితో బాదపడుతుంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే , మీరు ఎవరినైనా ఆవలించడం చూసినప్పుడు మీకు కూడా ఆవలింత రావడం సహజం. ఆవలింత అంటువ్యాధి. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు లేదా చూస్తున్నప్పుడు మరియు వారు ఆవలిస్తే, అది మీలో ఆవలింతను రేకెత్తిస్తుంది. కొన్ని అధ్యయనాలు ప్రకారం ఇది నిజమని కూడా తేలింది. దీనివల్ల మీ ఎదుటి మనిషి మీ మాటల్ని ఎంత ఏకాగ్రతగా వింటున్నారో తెలుస్తుంది.
మరియు మీరు ఏమైనా మందులు వాడుతున్నప్పుడు వాటి ప్రభావం కూడా మీపై వుండవచ్చు, సాధారణంగా ఆందోళన లేదా డిప్రెషన్‌కి చికిత్స చేయడానికి ఉపయోగించే మందులు ఎక్కువుగా ప్రభావం చూపవచ్చు.

విపరీతమైన ఆవలింతలు గుండె జబ్బులు, మూర్ఛ, మల్టిపుల్ స్క్లెరోసిస్, కాలేయ వైఫల్యం లేదా హైపోథైరాయిడిజంతో లాంటి ఆరోగ్య పరిస్తితులు ప్రభావం కూడా వుంటుంది. ఆవలింతలు ఎక్కువుగా రావడం శరీరంలో ఆరోగ్య పరమైన ఇబ్బందులు వున్నాయని సంకేతాలను ఇవ్వడం లాంటిది. ఇది మీకు జరిగితే, చెకప్ కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.