ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Wayanad Landslide – 43 మందిని పొట్టనబెట్టుకుంది
వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని ముండకైలో అర్థరాత్రి ఒంటి గంటకు ఒకసారి.. ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు మరోసారి కొండచరియలు విరిగిపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో 400కు పైగా కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడినట్లు పేర్కొన్నారు. చాలా మంది ఆచూకీ తెలియకపోవడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారంతా మట్టి దిబ్బల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని భయపడుతున్నారు.
ఇప్పటివరకు 43 మందిని పొట్టనబెట్టుకుంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందల మంది ప్రజలు.. శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు.
వెంటనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ పరిస్థితుల్లో కేరళలో వచ్చే 24 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు పడబోతోన్నాయి. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం.. కేరళ మధ్య, ఉత్తర ప్రాంతంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రత్యేకించి- అయిదు జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మళప్పురం, కోజికోడ్, వాయనాడ్, కాసర్‌గాడ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. 50 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. కొట్టాయం, కాసర్‌గాడ్, కన్నూర్, వాయనాడ్, పాలక్కాడ్, ఎర్నాకుళం, కోజికోడ్, మళప్పురం, ఇడుక్కి, త్రిశూర్ జిల్లాలకు ప్రభుత్వం సెలవును ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు నేడు సెలవు ఇచ్చినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు.
Wayanad Landslide – 43 మందిని పొట్టనబెట్టుకుంది