ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Vuhala pallakilo Lyrics in Telugu – Chitram
ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
కలహంసై కబురులందివ్వనా
రాచిలకై కిలకిల నవ్వనా
నా పెదవుల మధువులే ఇవ్వనా సయ్యాటలోనా
ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
ప్రేమలో తీపి చూసే వయసే నీదిరా
బ్రతుకులో చేదులున్న భయమే వద్దురా
సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా
పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా
సిరి తానుగానే వచ్చి నిన్ను చేరునురా
ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
మేఘాలకు నిచ్చెనే వేయనా
ఆకాశపుటంచులే వంచనా
ఆ జాబిలి కిందకే దించనా నా కన్నెకూన
ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
ఆశగా పల్లవించే పాటే నీవులే
జీవితం తోడులేని మూడేంకాదులే
కలిసుండే వేళలో కలతంటూ రాదులే
అమవాసై పోదులే అడియాశేం కాదులే
చిరుదివ్వె కాంతులింక దారి చూపునులే
ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
మేఘాలకు నిచ్చెనే వేయనా
ఆకాశపుటంచులే వంచనా
ఆ జాబిలి కిందకే దించనా నా కన్నెకూన
ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా