Menu Close

వినాయక చవితి గురుంచి మీకు తెలియని చాలా విషయాలు..! 21 రకాల పత్రి ?

వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి.

గణపతి ప్రతిమ, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, బియ్యం, రెండు దీపపు కుందులు, వత్తులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, కొబ్బరికాయలు, కలశం, ఆచమన పాత్రలు, మూడు ఉద్ధరిణలు, ఆచమనానికి ఒక పళ్లెం, 21 రకాల పత్రి, నైవేద్యానికి పండ్లు, వివిధ రకాల పూలు, తమలపాకులు, యజ్ఞోపవీతం.

21 రకాల పత్రి:

  1. సుముఖాయనమః – మాచీపత్రం పూజయామి।
  2. గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి।
  3. ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి।
  4. గజాననాయ నమః – దుర్వాయుగ్మం పూజయామి
  5. హరసూనవేనమః – దత్తూరపత్రం పూజయామి।
  6. లంబోదరాయనమః – బదరీపత్రం పూజయామి।
  7. గుహాగ్రజాయనమః – అపామార్గపత్రం పూజయామి।
  8. గజకర్ణాయనమః – తులసీపత్రం పూజయామి,
  9. ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి,
  10. వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి।
  11. భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి,
  12. వటవేనమః – దాడిమీపత్రం పూజయామి,
  13. సర్వేశ్వరాయనమః – దేవదారుపత్రం పూజయామి,
  14. ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి,
  15. హేరంబాయనమః – సింధువారపత్రం పూజయామి
  16. శూర్పకర్ణాయనమః – జాజీపత్రం పూజయామి,
  17. సురాగ్రజాయనమః – గండకీపత్రం పూజయామి,
  18. ఇభవక్త్రాయనమః – శమీపత్రం పూజయామి,
  19. వినాయకాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి,
  20. సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి।
  21. కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి।

వినాయక చవితి పూజా విధానంలోని శాస్త్రీయ కారణం:

మనకి తెలుసు మనిషికి వచ్చే రోగాలలో చాలా వరకు మనం తాగే నీటి నుండే సంక్రమిస్తాయని, ప్రతి సంవత్సరం ఈ సమయానికి వర్షాలు బాగా పడి వాగులు, వంకలు, చెరువులు నీటితో నిండి వుంటాయి. అదే సమయానికి వినాయక చవితి వస్తుంది, ప్రజలందరూ పూజ చేసుకుని వినాయుకుడి పసుపు విగ్రహం, ఔషధ గుణాలు కలిగిన 21 రకాల ఆకులు, పువ్వులు తీసుకు వెళ్ళి మంచి నీటి చెరువులో నిమజ్జనం చేసే వాళ్ళు. దీని వల్ల ఆ నీరు శుభ్ర పడటంతో పాటు ఆ నీటికి ఔషధ గుణాలు తోడౌతాయి. ఆ నీటిని తాగిన ప్రజలకి పసుపు వల్ల రోగ కారక శక్తి పెరుగుతుంది. నీతి నుండి సంక్రమించే వివిధ రకాల వ్యాదుల నుండి కూడా బద్రత కలుగుతుంది.

vinayaka chavithi
  • ఒకప్పుడు పసుపుతో వినాయుకుడి రూపం చేసి పూజించే వాళ్ళు మరి ఇప్పుడు మట్టితో ఎందుకు చేస్తునారో ఈ జనాలకే తెలియాలి..?
  • వినాయకుడికి పూజలు చెయ్యాలి, స్వాతంత్ర్య సమయంలో వినాయుకుడికి ఉత్సవాలు చెయ్యడం మొదలు పెట్టారు దానికి ఒక కారణం వుంది. ఇప్పుడు ఏ కారణం వల్ల ఉత్సవాలు చేసుకుంటున్నారో జనాలకే తెలియాలి..?
  • పండుగ భక్తితో జరగాలి, మత్తులో కాదు. ఏదో ఎంజాయ్ చెయ్యడానికి ఒక విగ్రహం పెట్టి నిమర్జనం చేస్తున్నారు తప్ప భక్తి లేదూ ఏమీ లేదు.
Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading