వేవేల జేజేలివే… జగమేలే జగదీశ్వరీ
మీకేలే మా పూజలే… భువిలోని భువనేశ్వరీ
పజ్జెనిమిది శక్తిపీఠాలలో… ముజ్జగములే ఏలు పెద్దమ్మలు
వెలసె అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు…
వేవేల జేజేలివే… జగమేలే జగదీశ్వరీ
వేవేల జేజేలివే…
హొయ్యరే హొయ్యారె హొయ్యా… హొయ్యరే హొయ్యారె హొయ్యా
హొయ్యరే హొయ్యారె హొయ్యా… హొయ్యరే హొయ్ హొయ్ హొయ్యా
హొయ్యరే హొయ్యారె హొయ్యా… హొయ్యరే హొయ్యారె హొయ్యా
హొయ్యరే హొయ్యారె హొయ్యా… హొయ్యరే హొయ్ హొయ్ హొయ్యా
మా గుండెలే నీ గుడిగంటలై… మారుమ్రోగేనే కోనంతా మా ఊరంతా
నాలుగు వైపుల పచ్చన… నువ్వు ఊరికి ఇచ్చిన దీవెన
ఇల్లిల్లు చేసేను చల్లన… నీ వెన్నెల చూపుల పాలన
సెలయెరులా అడవి పొలిమేరలా… ఉరికి ప్రవహించు ఓయమ్మ నీ ప్రేమయై
వేవేల చేతులతో వెలసితివమ్మా…
అమ్మా..! ముగ్గురమ్మలకే నువు మూలపుటమ్మ…
కొండల కోనల మధ్యలో… కోటి సూర్యులచంద్రుల వెలుగుతో
అండదండలియ్యనుంటివే… అక్కమ్మ చెల్లెమ్మ బంగరు తల్లి
వేవేల జేజేలివే… జగమేలే జగదీశ్వరీ
వేవేల జేజేలివే…
బంతమ్మ బంతి బంతికియాలో… సిత్రాల తోటకాడ సిలకమ్మ సిందులోయ్
గజ్జె కట్టి కుచ్చులోన పిచ్చుకమ్మ సవ్వడి… కోకిలమ్మ పాటకేమో గోరువంక సవ్వడి
నీవే కదా శ్రీ భ్రమరాంబిక… ఆ కాశీపురి అన్నపూర్ణాంబిక
మాధవీ దేవివి నీవెగా… ఆ మాణిక్యాంబవి నీవెగా
జోగులాంబ దేవి నీవెగా… పురుహూతికా దేవి నీవెగా
శ్రీలంకలో ఉన్న శాంకరి నీవే… సిరుల కొల్హపురి మహాలక్ష్మివి నీవే
బెజవాడలో కనకదుర్గాంబవి… తల్లీ ఉజ్జయినిలో మహాకాళివి నీవే
ఎక్కడ ఎక్కడ ఎప్పుడు… నువ్వు ఎన్నెన్ని రూపాలలో ఉన్నను
అక్కమ్మ చెల్లెమ్మ రూపున… మా పక్కనే ఉందువె చక్కని తల్లి…
వేవేల జేజేలివే… జగమేలే జగదీశ్వరీ
మీకేలే మా పూజలే… భువిలోని భువనేశ్వరీ
పజ్జెనిమిది శక్తిపీఠాలలో… ముజ్జగములే ఏలు పెద్దమ్మలు
వెలసె అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు…
వేవేల జేజేలివే… జగమేలే జగదీశ్వరీ
వేవేల జేజేలివే…
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.