ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
గణపతి రాజా… తయ్ తయ్ తయ్
చక్కని తాళం వేసెద… తయ్ తయ్
చెయ్యర నాట్యం… దిద్దాంద్డ తయ్
దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ
దిద్ది తడిగిడ దిద్దిత్తయ్
తకిట తకిట దిమి
తయ్ తయ్ తయ్ తయ్
తకదిమి తకదిమి దిద్దాంద్డ తయ్
తకిట తకిట దిమి
తయ్ తయ్ తయ్ తయ్
తకదిమి తకదిమి దిద్దాంద్డ తయ్
వేణువులో చేరని గాలికి… సంగీతం లేదా
వెల్లువలా తుళ్ళిన చినుకులలో… నాట్యం లేదా
ఒకసారి చూడు మనసు అనే… కనుపాపతోటి సరిగా
హృదయానికున్న ముసుగులనే… తొలగించి దాటి రా
పల్లానికి పారిన ఏటికి… వయ్యారం లేదా
ఆకారమే ఉండని మెరుపులకి… తళుకు సొగసు లేదా
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
గణపతి రాజా… తయ్ తయ్ తయ్
చక్కని తాళం వేసెద… తయ్ తయ్
చెయ్యర నాట్యం… దిద్దాంద్డ తయ్
దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ
దిద్ది తడిగిడ దిద్దిత్తయ్
దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ
దిద్ది తడిగిడ దిద్దిత్తయ్
తకిట తకిట దిమి
తయ్ తయ్ తయ్ తయ్
తకదిమి తకదిమి దిద్దాంద్డ తయ్
వేణువులో చేరని గాలికి… సంగీతం లేదా
వెల్లువలా తుళ్ళిన చినుకులలో… నాట్యం లేదా
ఒకసారి చూడు మనసు అనే… కనుపాపతోటి సరిగా
హృదయానికున్న ముసుగులనే… తొలగించి దాటి రా
పల్లానికి పారిన ఏటికి… వయ్యారం లేదా
ఆకారమే ఉండని మెరుపులకి… తళుకు సొగసు లేదా
ఎవరు పొగిడేనని… నెమలి ఆడేనట
ఒకరి కోసం అని… పూలు పూస్తాయ
ఎగిరిన గువ్వ రెక్క… నింగి నలుపు చూసి
హద్దు అంటు ఆగిపోదుగా
గుండెలోన పొంగుతున్న కలయిది
ఆనకట్టలేయకే ఇకా
చెదిరిపడిన చిరు మువ్వైనా
నిశ్శబ్దాన్ని చీల్చుతూ మోగునుగా
అడుగునాపు గీతాల్ని చెరిపి రాలేవా
తడబడేటి పసి పాదాలైనా
నాట్యానికి పాఠాలు అని
తెలుసుకుంటె నీ తనువులోని
ప్రతి కదలిక భంగిమ కాదా మరి
అంతులేని ఓ సంద్రమల్లె
నీలోన దాగిన నటనలని
అణువు అణువునా నింపుకుంటు
ఆనంద తాండవం చేసేయ్యనీ
నింగిలోని మేఘాల వెనుకనే
లోకం ఉందని జాబిల్లి నిదురించనంటే
తన వెన్నెలంతా చీకటి పాలైపోదా అది
కట్టడాల స్తంభాల వెనుకనే
కళ ఉందని పొరపాటు పడి
ఆపమాకు నీ అడుగు అడుగుని
అవధులు దాటుతూ నర్తించనీ
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
గణపతి రాజా… తయ్ తయ్ తయ్
చక్కని తాళం వేసెద… తయ్ తయ్
చెయ్యర నాట్యం… దిద్దాంద్డ తయ్
దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ
దిద్ది తడిగిడ దిద్దిత్తయ్
దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ
దిద్ది తడిగిడ దిద్దిత్తయ్
తకిట తకిట దిమి
తయ్ తయ్ తయ్ తయ్
తకదిమి తకదిమి దిద్దాంద్డ తయ్