ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Vennello Nadiche Mabbullaga Song Lyrics In Telugu – Antahpuram
కళ్యాణం కానుంది కన్నె జానకికీ
(కళ్యాణం కానుంది కన్నె జానకికీ)
వైభోగం రానుంది రామచంద్రుడికీ
(వైభోగం రానుంది రామచంద్రుడికీ)
దేవతలే దిగి రావాలీ జరిగే వేడుకకీ
రావమ్మా సీతమ్మా సిగ్గు దొంతరలో
రావయ్యా రామయ్యా పెళ్ళి శోభలతో
వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా… వర్షంలో తడిసే సంద్రంలాగా
ఊరేగే పువ్వుల్లో చెలరేగే నవ్వుల్లో
అంతా సౌందర్యమే అన్నీ నీ కోసమే
వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా… వర్షంలో తడిసే సంద్రంలాగా
నాలో ఎన్ని ఆశలో… అలల్లా పొంగుతున్నవీ
నీతో ఎన్ని చెప్పినా… మరెన్నో మిగులుతున్నవీ
కళ్ళల్లోనే వాలీ నీలాకాశం అంతా ఎలా ఒదిగిందో
ఆ గగనాన్ని ఏలే పున్నమి రాజు ఎదలో ఎలా వాలాడో
నక్షత్రాలన్నీ ఇలా కలలై వచ్చాయి
చూస్తూనే నిజమై అవీ ఎదటే నిలిచాయి
అణువణువు అమృతంలో… తడిసింది అద్భుతంగా
వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా… వర్షంలో తడిసే సంద్రంలాగా
ఇట్టే కరుగుతున్నదీ… మహాప్రియమైన ఈ క్షణం
వెనకకు తిరగనన్నదీ… ఎలా కాలాన్ని ఆపడం
వదిలామంటే నేడు తియ్యని స్మృతిగా మారి ఎటో పోతుందీ
కావాలంటే చూడు ఈ ఆనందం… మనతో తను వస్తుందీ
ఈ హాయి అంతా మహా భద్రంగా దాచి… పాపాయి చేసి నా ప్రాణాలే పోసి
నూరేళ్ళ కానుకల్లే… నీ చేతికీయలేనా
ఆకాశం అంతఃపురమయ్యింది… నాకోసం అందిన వరమయ్యింది
రావమ్మా మహరాణి ఏలమ్మా కాలాన్నీ
అందీ ఈ లోకమే… అంతా సౌందర్యమే, ఏ ఏఏ
ఆకాశం అంతఃపురమయ్యింది… నాకోసం అందిన వరమయ్యింది