ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న
వదిలేసావా నన్నే ఎడబాటునా…
కసిరే వేదనలోన… మసిలే ధైర్యం లేని
పసివాన్నేలే ఇంకా ఎదమాటున…
మదిలో ఎంతో దిగులే ఉన్నా… నవ్వుతూ నన్నే పెంచావు నాన్న
కరిగే మైనం నువ్వవుతున్నా… నిషిలో వెలుగై నడిపావు నాన్న
వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న
వదిలేసావా నన్నే ఎడబాటునా…
కసిరి వేదనలోన… మసిలే ధైర్యం లేని
పసివాన్నేలే ఇంకా ఎదమాటున…
నువ్వు కరుణిస్తే కను తెరిచా… నువ్ నడిపిస్తే నే నడిచా
నువ్ చూపిస్తే జగమెరిగాను…
నువ్వు కధ చెబితే మైమరిచా… నీ ఎదపైనే నిదురించా
నీ కొడుకై తరియించాను…
నువ్వే లేని నేనే లేను… నువ్వు నేను వేరే కాము
నాలో నేను నువ్వే న్నాన్న…
మదిలో ఎంతో దిగులే ఉన్నా…
నవ్వుతూ నన్నే పెంచావు నాన్న…
కరిగే మైనం నువ్వవుతున్నా…
నిషిలో వెలుగై నడిపావు నాన్న…