Menu Close

వీర ధీర శూర మూవీ రివ్యూ – Veera Dheera Soora Movie Review – 2025


వీర ధీర శూర మూవీ రివ్యూ – Veera Dheera Soora Movie Review – 2025

Veera Dheera Soora Movie Review – 2025: విక్రమ్‌ హీరోగా నటించిన వీర ధీర శూర మూవీ ఎట్టకేలకు రిలీజ్‌ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

వీర ధీర శూర మూవీ రివ్యూ - Veera Dheera Soora Movie Review - 2025

విలక్షణ నటుడు విక్రమ్‌ నటుడిగా నిరూపించుకుంటున్నారు. కానీ కమర్షియల్‌ హిట్‌ పడటం లేదు. ఇటీవల చాలా సినిమాలు డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. చివరగా చేసిన తంగలాన్‌ కూడా డిజప్పాయింట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాన్స్ కోసం కమర్షియల్‌ మూవీ వీర ధీర శూర చేశాడు. దీనికి ఎస్‌ యూ అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.

ఇందులో విక్రమ్‌కి జోడీగా దుస్సరా విజయన్‌ నటించగా, ఎస్‌ జే సూర్య, సూరజ్‌, 30 ఇయర్స్ పృథ్వీ కీలక పాత్రలు పోషించారు. హెచ్‌ ఆర్‌ పిక్చర్స్ పతాకంపై రియా షిబు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేశారు. అయితే పలు ఫైనాన్స్ సమస్యల కారణంగా ఈ మూవీ గురువారం(మార్చి 27)న ఉదయం రిలీజ్‌ కాలేదు. అన్ని సమస్యలు సెట్‌ చేసుకుని ఈవినింగ్‌ విడుదలయ్యింది. మరి సినిమా ఎలా ఉంది? విక్రమ్‌ కి ఈ సారైనా హిట్‌ దొరికిందా? అనేది చూడాలి.

ఇటీవల రా అండ్‌ రస్టిక్‌ మూవీస్‌ బాగా ఆడుతున్నాయి. మాస్‌ కమర్షియల్‌ అంశాలను జోడించి ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా, ట్విస్ట్ ల, టర్న్ లు, ఎలివేషన్లతో తెరకెక్కిస్తే మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి మూవీస్‌ ట్రెండ్‌ నడుస్తుంది. అందులో భాగంగా విక్రమ్‌ కూడా ఫ్యాన్స్ ని ఖుషీ చేసేందుకు, తాను కమ్‌ బాక్‌ కోసం వీర ధీర శూర మూవీలో నటించారు. ఈ మూవీ కార్తి ఖైదీని తలపిస్తుంది

నటీనటుల యాక్టింగ్ ఎలా వుంది?

కాళి పాత్రలో విక్రమ్‌ అదరగొట్టాడు. తనదైన యాక్టింగ్‌తో మెప్పించారు. కాళి పాత్రలో జీవించారు. పాత్రని రక్తికట్టించాడు. అదే సమయంలో డీసెంట్‌గా బిహేవ్‌ చేస్తూ ఆకట్టుకున్నారు. కావాల్సిన ఎలివేషన్లకు ప్రయారిటీ ఇవ్వలేదు. కానీ నటుడిగా ఆయన దుమ్ములేపాడని చెప్పొచ్చు. ఆయన భార్య పాత్రలో దుసరా విజయన్‌ సైతం అంతే సహజంగా చేసింది. అందరి దృష్టిని ఆకర్షించింది.

కన్నన్‌ పాత్రలో సూరజ్‌ బాగా చేశాడు. మరో హైలైట్‌ అయ్యే పాత్ర అయనది. ఇరగదీశాడు. ఇక పెద్దాయన రవి పాత్రలో పృథ్వీరాజ్‌ నటన కూడా ఆకట్టుకుంది. మనకు ఆయన కమెడియన్‌గా తెలుసు. దీంతో విలన్‌గా చూడలేకపోతున్నాం. ఆ పాత్రకి ఇంకా ఎలివేషన్లు, బాక్‌ స్టోరీ ఉంటే బాగుండేది. ఎస్పీగా ఎస్‌ జే సూర్య సినిమాకి మరో పెద్ద అసెట్‌. ఆయన చేసిన రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు.

ఇందులో ఎస్పీగా ఎత్తులకు పై ఎత్తులు వేసే వ్యక్తిగా సూర్య దుమ్ములేపాడు. పాత్రకి ప్రాణం పోశాడు. హీరోని డామినేట్‌ చేసే పాత్రలో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ లో ఆయన పాత్రని డమ్మీ చేశారనిపిస్తుంది. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయని చెప్పండి.

టెక్నీషియన్ల వర్క్ ఎలా వుంది?

టెక్నీకల్‌గా సినిమా బాగుంది. ముఖ్యంగా తేని ఈశ్వర్‌ కెమెరా వర్క్ వేరే లెవల్‌. బాగా షూట్‌ చేశారు. ప్రసన్న జీకే ఎడిటింగ్‌ ఇంకా కత్తెరకు పనిచెప్పాల్సింది. సినిమా చాలా స్లోగా రన్‌ అవుతుంది. ఆ విషయంలో కొంత కేర్ తీసుకోవాల్సింది. జీవీ ప్రకాష్‌ మ్యూజిక్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌. అతి లౌడ్‌గా వెళ్లకుండా థ్రిల్లర్‌ మిక్స్ చేసి ఆయన ఇచ్చిన మ్యూజిక్‌ అదిరిపోయింది.

దర్శకుడు అరుణ్‌ ఈ మూవీని రెండు పార్ట్ లుగా తీసుకురావాలనుకున్నారు. కానీ ఇప్పుడు రెండో పార్ట్ ని ముందుగా విడుదల చేశారు. ఫస్ట్ పార్ట్ ఈ మూవీ రిలీజ్‌ అయితే ఉంటుంది. దీంతో ఇందులో కథ సరిగా చెప్పలేదు. అదే కన్‌ఫ్యూజన్‌కి కారణమవుతుంది. ఈ విషయంలో మరింత గ్రిప్పింగ్‌గా కథనాన్ని రాసుకుంటే బాగుంటుంది.

ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించే వీర ధీర శూర. తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం కష్టమే అంటున్నారు.

ఇంతకీ మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చెయ్యడం మరవకండి.

Trendingక్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ – Adolescence – Web Series Recommendation – 2025

రెండో అభిప్రాయం తప్పనిసరి | Telugu Moral Stories

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Movie Reviews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading