వరించే ప్రేమ నీకు వందనం… సమస్తం చేసా నీకే అంకితం
నిజంగా ప్రియంగా నిరీక్షనే నీకై చేసినానే క్షణమొక యుగమై
నీవు లేని నా పయనమే… నిదుర లేని ఓ నయనమే
నిన్నే వెతికిన హృదయమే… అలిసే సొలిసే
నిన్నే తలచు ఏ రోజున నిలుపలేక ఆ వేదన
సలిపినానే ఆరాధన దిల్ సే దిల్ సే
వరించే ప్రేమ నీకు వందనం… సమస్తం చేసా నీకే అంకితం
వరంగా నాకోనాడే నువ్వు కనిపించంగ
ప్రియంగా మాటాడానే నే నును వెచ్చగా
ఓఓ..! నా మనసుకి చెలిమైనది నీ హస్తమే
నా అంతస్తుకి కలిమైనది నీ నేస్తమే
నీ చూపులు నా ఎద చొరబడనే
నీ పలుకులు మరి మరి వినబడనే
నీ గురుతులు చెదరక నిలబడనే… ఒక తీపి గతమల్లె
నిండు జగతికో జ్ఞాపకం… నాకు మాత్రమది జీవితం
ప్రేమ దాచిన నిష్టురం మదినే తొలిచే
అన్నీ ఉన్నా నా జీవితం… నీవు లేని బృందావనం
నోచుకోదులే ఏ సుఖం… దిల్ సే దిల్ సే
వరించే ప్రేమ నీకు వందనం… సమస్తం చేసా నీకే అంకితం
నజీర లేని లోకం ఓ పెను చీకటే… శరీరమేగా బేధం ఆత్మలు ఒక్కటే
ఓఓ ఓ… తను శ్వాసగా నను నిలిపెలే నా ప్రాణమే
ఓఓ ఓ… తన ధ్యాసలో స్పృహ తప్పెలే నా హృదయమే
తన రాతకు నేనొక ఆమనిగా… ఒక సీతను నమ్మిన రామునిగా
వనవాసము చేసెడి వేమనగ… వేచేను ఇన్నాళ్ళు
తారవ ప్రళయ ధారవ… దూరమై దరికి చేరవ
మాధురై ఎదను మీటవ… మనసే మనసే
ప్రేమలే పొంగే వెల్లువ… తేనెలే చిలికి చల్లగా
తీగల మేను అల్లవా… దిల్ సే దిల్ సే
వరించే ప్రేమ నీకు వందనం… సమస్తం చేసా నీకే అంకితం
నిజంగా ప్రియంగా నిరీక్షనే నీకై చేసినానే క్షణమొక యుగమై
నీవు లేని నా పయనమే… నిదుర లేని ఓ నయనమే
నిన్నే వెతికిన హృదయమే… అలిసే సొలిసే
నిన్నే తలచు ఏ రోజున నిలుపలేక ఆ వేదన
సలిపినానే ఆరాధన దిల్ సే దిల్ సే
వరించే ప్రేమ నీకు వందనం… సమస్తం చేసా నీకే అంకితం
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.