Menu Close

Unnattundi Gunde Song Lyrics In Telugu – Ninnu Kori – ఉన్నట్టుండి గుండె లిరిక్స్

Unnattundi Gunde Song Lyrics In Telugu – Ninnu Kori – ఉన్నట్టుండి గుండె లిరిక్స్

ఉన్నట్టుండి గుండె… వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది…
సంతోషాలే నిండే… బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది…

నేనా, నేనా ఇలా నీతో ఉన్న…
అవునా, అవునా… అంటూ ఆహా అన్నా…

హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు… ముచ్చటగా నను హత్తుకుపోయే…
పోయే… పోయే.. ఏ ఏ ఏ ఏ హత్తుకు పోయే…
చుక్కలు చూడని లోకంలోకి… చప్పున నన్ను తీసుకుపోయే…
పోయే… పోయే… ఏ ఏ ఏ ఏ తీసుకు పోయే…

ఉన్నట్టుండి గుండె… వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది…
సంతోషాలే నిండే… బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది…

ఏ దారం ఇలా లాగిందో మరి… నీ తోడై చెలీ పొంగిందే మది…
అడిగి పొందినది కాదులే… తనుగా దొరికినది కానుక…
ఇకపై సెకనుకొక వేడుక కోరే…
కల… నీలా… నా చెంత చేరుకుందిగా…

హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు… ముచ్చటగా నను హత్తుకు పోయే…
పోయే… పోయే.. ఏ ఏ ఏ ఏ హత్తుకు పోయే…
చుక్కలు చూడని లోకం లోకి… చప్పున నన్ను తీసుకు పోయే…
పోయే… పోయే… ఏ ఏ ఏ ఏ తీసుకు పోయే…

ఆనందం సగం… ఆశ్చర్యం సగం…
ఏమైనా నిజం… బాగుంది నిజం…

కాలం కదలికల సాక్షిగా… ప్రేమై కదిలినది జీవితం…
ఇకపై పదిలమే నా పదం…
నీతో… అటో… ఇటో… ఏవైపు దారి చూసిన…

ఉన్నట్టుండి గుండె… వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది…
సంతోషాలే నిండే… బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది…

నేనా, నేనా ఇలా నీతో ఉన్న…
అవునా, అవునా… అంటూ ఆహా అన్నా…

హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు… ముచ్చటగా నను హత్తుకు పోయే…
పోయే… పోయే.. ఏ ఏ ఏ ఏ హత్తుకు పోయే…
చుక్కలు చూడని లోకం లోకి… చప్పున నన్ను తీసుకు పోయే…
పోయే… పోయే… ఏ ఏ ఏ ఏ తీసుకు పోయే.. ..

Subscribe to Our YouTube Channel

Unnattundi Gunde Song Lyrics In Telugu – Ninnu Kori – ఉన్నట్టుండి గుండె లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading