ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఉండిపో ఉండిపో… చేతిలో గీతలా
ఎప్పుడూ ఉండిపో… నుదిటిపై రాతలా
ఉండిపో ఉండిపో… కల్లలో కాంతిలా
ఎప్పుడూ ఉండిపో… పెదవిపై నవ్వులా
నీతోనే నిండిపోయె… నా జీవితం
వదిలేసి వెళ్లనంది… ఏ జ్ఞాపకం
మనసే మొయ్యలేనంతలా… పట్టి కొలవలేనంతల
విప్పీ చెప్పలేనంతలా… హాయే కమ్ముకుంటుందిగా
ఎంటో చంటి పిల్లాడిలా… నేనే తప్పిపోయానుగా
నన్నే వెతుకుతు ఉండగా… నీలో దొరుకుతున్నానుగా
ఉండిపో ఉండిపో… చేతిలో గీతలా
ఎప్పుడూ ఉండిపో… నుదిటిపై రాతలా
సరికొత్త తడబాటే… మారింది అలవాటులాగా
ఇది చెడ్డ అలవాటే… వదిలేసి ఒక మాటు రావా
మెడవంపు తాకుతుంటే… మునివేళ్లతో
బిడియాలు పారిపోవా… ఎటువైపుకో
ఆహా సన్నగా సన్నగా… సన్నజాజిలా నవ్వగా
ప్రాణం లేచి వచ్చిందిగా… మల్లి పుట్టినట్టుందిగా
ఓహో మెల్లగా మెల్లగా… కాటుకల్లనే తిప్పగా
నేనో రంగుల రాట్నమై… చుట్టూ తిరుగుతున్నానుగా
తలనిమిరే చనువవుతా… నువ్వు గాని పొలమారుతుంటే
ఆ మాటే నిజమైతే… ప్రతిసారీ పొలమారిపోత
అడగాలి గాని నువ్వు అలవోకగా… నా ప్రాణమైన ఇస్తా అలవోకగా
ప్రాణం నీదని నాదని… రెండు వేరుగా లావుగా
ఎప్పుడో కలుపుకున్నాం కదా… విడిగా ఉండలేనంతగా
ఉందాం అడుగులో అడుగులా… విందాం ప్రేమలో గల గల
బంధం బిగిసిపోయిందిగా… అంతం కాదులే మన కథ