అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Travel Quotes in Telugu – ట్రావెల్ కోట్స్
నేను: ఇంకా చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి.
నా బ్యాంక్ అకౌంట్: బ్యాలెన్స్ నిల్.
ట్రై అగైన్ లేటర్.
నా టెన్షన్లన్నీ మరచిపోయేంత వరకు
ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి
కొన్ని రోజులు గడపాలని ఉంది.

ఏడాదికోసారి మనకు పరిచయం లేని ప్రదేశానికి వెళితే
ఎంత బాగుంటుందో కదా.
ప్రపంచమంతా
నా జ్ఞాపకాలు వదిలి వెళ్లాలని నేను భావిస్తున్నా.
టూరిస్ట్‌గా ఉండి పోతే ఎలా?
ట్రావెలర్‌గా మారేదెప్పుడు?
నాకు పరిచయమే లేని ప్రదేశాలతో
నేను ప్రేమలో పడిపోతున్నా.
ఒంటరిగా ప్రయాణం చేస్తూ
నాకే తెలియని నా గురించి తెలుసుకుంటున్నా.
మన టూర్ పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు.
హ్యాపీగా సాగిపోతే చాలు.
సోలో ట్రావెలింగ్..
నీలో దాగున్న భయాలను తొలగిస్తుంది.
ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చేస్తున్నామనుకోవద్దు.
ఈ ప్రపంచమంతా మనకు స్నేహితులే ఉన్నారు.
వారు మీకోసం ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు వెళ్లకపోతే.. ఎప్పటికీ వెళ్లలేం.
వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.- లావో ట్జు
మిమ్మల్ని మీరు కలుసుకునేంత వరకు
ప్రయాణిస్తూనే ఉండండి – డేవిడ్ మిషెల్
వాట్ ఏ వండర్ఫుల్ వరల్డ్..
ఈ ప్రపంచాన్నిచూడటానికి ఈ రెండు కళ్లూ సరిపోవడం లేదు.
ఒడ్డున ఉన్నంత వరకు ఓడ చాలా సురక్షితంగా ఉంటుంది.
అలా ఒడ్డున ఉంచడం కోసం దాన్ని తయారు చేయలేదు.
నేనెక్కడికి వెళితే అదే నా ఇల్లు.
జీవితం ఓ ప్రయాణం.
అదే గమ్యం కాదు.
మనం చూడని దాని గురించి
వంద సార్లు వినడం కంటే
ఒక్కసారి దాన్ని చూడటం మేలు.
ఎక్కడికి వెళ్లినా మన హృదయం మన వెంటే ఉండాలి.
మనం ఏం చేసినా..
అది మనల్ని సంతోషపెట్టేదే అయి ఉండాలి.
Travel Quotes in Telugu – ట్రావెల్ కోట్స్