Menu Close

ఆఫ్రికా ఎందుకు ఇంకా పేదరికంలో ఉంది? ఈ నిజాలు తెలుస్తే షాక్ అవుతారు – Top 10 Reasons Why Africa Remains Underdeveloped


ఆఫ్రికా ఎందుకు ఇంకా పేదరికంలో ఉంది? ఈ నిజాలు తెలుస్తే షాక్ అవుతారు – Top 10 Reasons Why Africa Remains Underdeveloped

ఆఫ్రికా పేదరికానికి కారణమైన 10 ముఖ్యమైన విషయాలు:

Top 10 Reasons Why Africa Remains Underdeveloped
  1. గతంలో బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగల్ వంటి యూరోపియన్ దేశాలు శతాబ్దాల పాటు ఆఫ్రికా ఖండాన్ని పాలించాయి. ఈ కాలనియల్ పాలన స్థానిక సంపదను దోచుకోవడం, స్థానిక వ్యవస్థలను ధ్వంసం చేయడం జరిగింది.
  2. చాలా ఆఫ్రికా దేశాల్లో పాలకులు వ్యక్తిగత లాభం కోసమే పనిచేస్తున్నారు. ప్రజల కోసం రావాల్సిన ధనాన్ని దోచుకుంటున్నారు.
  3. ఎన్నో దేశాలు అంతర్గత యుద్ధాలతో నాశనమయ్యాయి. ప్రజలు శరణార్థులయ్యారు, వ్యవస్థలు దెబ్బతిన్నాయి.
  4. మాలేరియా, ఎయిడ్స్ వంటి రోగాలు అధికంగా ఉన్నాయి. సరైన వైద్య సేవలు లేవు. ఇది ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టి, ఉత్పాదకత తగ్గిస్తుంది.
  5. మంచి విద్యా సదుపాయాలు లేవు. చాలా మంది పిల్లలు స్కూల్‌కే వెళ్లలేని పరిస్థితి. ఇది వారి భవిష్యత్తు ఎదుగుదలను అడ్డుకుంటుంది.
  6. చాలామంది దేశాలు ఇంకా విదేశీ పెట్టుబడులపై, రుణాలపై ఆధారపడుతున్నాయి. తమ స్వంత వ్యవస్థలు బలపడలేదు.
  7. ఆధునిక వ్యవసాయం, పరిశ్రమలు అభివృద్ధి చెందలేదు. ఇది ఉద్యోగ అవకాశాలు తగ్గించి, సామాజిక స్థితిగతులను దెబ్బతీస్తోంది.
  8. వర్షాభావాలు, వనరుల కొరత వల్ల తిండి కూడా లభించని స్థితి. దీని వల్ల బాలింతలు, చిన్నపిల్లలు ముఖ్యంగా బాధపడుతున్నారు.
  9. బంగారం, డైమండ్, ఆయిల్ వంటి విలువైన వనరులు ఉన్నా, అవి సామాన్య ప్రజలకు లాభం చేకూర్చకుండా విదేశీ సంస్థలు లేదా కొన్ని వ్యక్తుల చేతుల్లోనే మిగిలిపోయాయి.
  10. మౌలిక సదుపాయాలు, ఇంటర్నెట్, రవాణా వ్యవస్థలో వెనుకబడి ఉండడం వల్ల ప్రపంచంతో పోటీ పడే అవకాశాలు తగ్గిపోయాయి.

ఈ అంశాలన్నీ కలిసి ఆఫ్రికాను పేదతనంలో కూరుకుపోయేలా చేశాయి. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని దేశాలు మార్పు దిశగా కదులుతున్నాయి – విద్య, టెక్నాలజీ, టూరిజం రంగాల్లో అభివృద్ధి పొందుతుంది. ఇంకా ఆశాజనక విషయమేంటంటే – కొంతమంది యువ నాయకులు ఆఫ్రికా స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

“బాబా వంగా” ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించే పేరు – Baba Vanga Predictions in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Information Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading