Menu Close

ప్రశాంతమైన వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు – సుప్రీంకోర్టు జడ్జి – Top 10 Golden Rules for Old People

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ప్రశాంతమైన వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు – Top 10 Golden Rules for Old People

పదవి విరమణ చేసిన సుప్రీంకోర్టు (ఫ్యామిలీ కోర్ట్) జడ్జి గారి మాటల్లో..

Top 10 Golden Rules for Old People:
ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు కోడలితో కలిసి ఉండకండి. అవసరమైతే వారిని అద్దె ఇంట్లో ఉండమని చెప్పిండి. మీ పిల్లలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియ్యంకులతో, మీ కోడలితో, మీ బంధుత్వాలు అంత బాగా ఉంటాయి.

మీ కుమారుడ భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి లేదా ఒక స్నేహితురాలిగా చూడండి అంతే తప్ప ఆమెను ఒక కుమార్తెగా చూడొద్దు. మీ అబ్బాయిని అన్నట్టుగానే ఆమెను కూడా పొరపాటున ఒక మాట కూడా అనవద్దు. అది ఆమె జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది. ఆమెను తిట్టే హక్కు కేవలం ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది.

old man with sad face maid

మీ కోడలు అలవాట్లు లేక ప్రవర్తన అది కేవలం మీ అబ్బాయి సమస్య. మీకు సంబంధం లేదు. అనవసరం కూడా లేదు.

ఒకవేళ మీరు కలిసి ఉంటున్నా కూడా ఎవరి పనుల్ని వారు చేసుకోండి. వారికి సంబంధించిన ఏ పని మీరు చేయొద్దు. ఒకవేళ మీ కోడలు ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటే కనుక తిరిగి ఏమి ఆశించకుండా మాత్రమే ఆ పని మీరు చేయండి.

మీ కుమారుడి కుటుంబ సమస్యలు మీమీద వేసుకోకండి. మీ కొడుకు, కోడలు వాదించుకున్నప్పుడు, మీరు చెవిటివారిలా ఉండిపోండి సాధారణంగా పెద్దల కల్పించుకోవడం వారికి ఇష్టం ఉండదు.

మీ మనుమలు పూర్తిగా మీ కొడుకు కోడలు యొక్క ఆస్తి. మనుమల మీద మీకు ఎటువంటి హక్కు లేదు. వారు వారి పిల్లల్ని ఎలా పెంచుకుంటారు అనేది వారి ఇష్టం.

మీ కోడలు మిమ్మల్ని గౌరవించవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అలా ఆశించకండి. ఒక మంచి వ్యక్తిగా మసులుకోమని మాత్రమే మీరు మీ కుమారుడికి చెప్పండి.

మీ పదవీ విరమణ కోసం మీరు ఎక్కువగా ప్రణాళికలు రచించుకోండి. మీ మిగతా జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోండి.

ఇంతకాలం మీరు దాచుకున్న సొమ్మును హాయిగా ఖర్చు పెట్టుకోండి. మీరు ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మీ డబ్బులు మీకు పనికిరాకుండా పోయేలా చేసుకోకండి.

మీ ఆస్తిపాస్తులు మీ తదనంతరమే మీ బిడ్డలకు దక్కేలా వీలునామా రాయించండి. లేకపోతే బజారు పాలయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి.

మిమ్మల్ని కట్టిపడేసే దారం కారు, మీ ఎదుగుదలకి ఆధారం వారు – Unknown Facts about Parents
మనల్ని ప్రేమించిన వారిపట్ల నిర్లక్ష్యం చూపకూడదు – Moral Stories in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading