Top 10 Dialogues from Devara Movie – NTR – దేవర డైలాగ్స్
చాలా పెద్ద కథ సామీ,
రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.
పడి పడి లేచే సముద్రం మీద
పడకుండా నిలబడిన వాడి కథ..
మా దేవర కథ.
“భయం పోవాలంటే
దేవుడి కథ వినాలా,
భయం అంటే ఏంటో తెలియాలంటే
దేవర కథ వినాలా”
తరువాత తరానికి చెప్పుకునేటంత కథలు కావురా.. మీ నాయనవి.
మా నాయనోళ్లవి దేశం కోసం పోరాడిన వీరుల కథలు.
మావీ.. ఎవ్వరికీ చెప్పుకోలేని చీకటి కథలు,
బతికున్నామే గాని,
భావితరాలకు కథలుగా చెప్పుకునేలా
ఈ బతుకులు మారుతాయో లేదో మాకుడా తెలియదు.
కులం లేదు,
మతం లేదు,
భయం లేదు
వారికి తెలిసింది ధైర్యమే.
మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడటానికి పుట్టాయ్,
మీ ఆయుధాలు మంచిని చంపడానికి పుట్టాయ్.
“చేసే పని తప్పని తెలిసినా
మన అవసరం కోసం చేస్తున్నావ్ అనుకున్నా,
ఇప్పుడు అదే అలవాటుగా మారి
తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయాయని
ఇప్పుడే అర్ధం అవుతా ఉండాది.“
“మనిషికి బతికేంత ధైర్యం చాలు,
చంపేంత ధైర్యం కాదు”.
కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే..
ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా..!
“దేవర అడిగినాడంటే.. సెప్పినాడని,
అదే సెప్పినాడంటే”…
ధైర్యం ఎక్కువై తప్పుడు పనులు చేస్తున్నా, మనోళ్లే కదా మాట చెబితే మారుతారు అనుకున్నా..
కానీ, భయం అంటే ఏమిటో తెలియని మృగాలుగా మారిపోయారు అని అర్థమై ఉండాది
మీ కళ్లముందు ఉంటే భగవంతుడికి, భూతానికి కూడా భయపడరు
అందుకే ఈరోజు నుంచి వాళ్లలెక్క మీ నుండి దూరంగా వెళ్లిపోయి.. కానరాని భయాన్ని అయితా..
భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పనికోసం సంద్రం ఎక్కితే… సంద్రం ఒడ్డున ఇట్టా పండబెడుతా..!”.
“దేవరను చంపాలంటే సరైనా సమయమే కాదు
సరైన ఆయుధం కూడా దొరకాలా..”
“వాడికి వాళ్ల అయ్య రూపం వచ్చింది కాని, రక్తం రాలే..
ఎప్పుడు చూడు పిల్లతనం, పిరికితనం వాడితో ఎట్టాగే,
నా మగాన్ని ఆమడ దూరం నుంచి చూసినా..
లోపల నుంచి పొంగాలా.. ఉప్పొంగాలా!!
ఏమి జరగనట్లు అందరూ అంతా మరచిపోతే మంచిది బైరా..
వాళ్లు ఆడు కలిపిన మత్తు మందుకే పడినారంటే.. పొద్దునకళ్లా మత్తు దిగాలా..
కానీ, వాళ్లు మంచం కూడా దిగలా..
ఆయుధ పూజలో మీరు వాడి కంట్లో బెరుకునే చూసుండారు..
కానీ నేను వాడి దెబ్బలో ఒడుపు చూసినా!
దేవర లెక్క బలాన్ని చూసినా
వాడి బలం వాడికి కూడా తెలియక, ఇలా అందర్ని మత్తులో పెట్టి గెలవాలనుకోవడం వాడి పసితనం
కానీ ఓ రకంగా మీ అందరికీ, అదే మంచిది
సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలు
కొండ మీద ఇంకో దేవరను తయారు చేస్తే అది మీకే మంచిది కాదు భైరా..
“ప్రతి ఆడదానికి… నచ్చినోడు ఒకడుంటాడు
వచ్చినోడు ఇంకోడుంటాడు
వచ్చినోడిలో నచ్చినవాడిని చూసుకుని
దీపం ఆర్పేసుకుని కాపురం చేసుకుంటే
బతుకు సాఫీగా సాగిపోతది”
Best Devara dialogues,
Iconic lines from Devara,
Memorable quotes from Devara,
Top 10 dialogues of Devara,
Famous dialogues in Devara,
Best one-liners from Devara,
Devara movie memorable dialogues,
Top quotes from Devara film,
Best dialogues by characters in Devara,
Devara movie dialogues compilation
Top 10 Dialogues from Devara Movie – NTR – దేవర డైలాగ్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.