Menu Close

Tillu Square Dialogues in Telugu – 2023

Tillu Square Dialogues in Telugu – 2023

మందు ఎప్పుడైనా మర్యాదగా తాగలి.. అట్ల రెవల్యూషన్‌లాగా రప్ప.. రప్ప తాగొద్దు. అర్థమైందా..

డైరెక్టర్ యాక్షన్ చెప్పేలోగా మనం డైలాగ్ చెప్పేస్తాం అట్లుంటది మనతోని.

ఎయిర్ హోస్టెస్ .. కాల్ సెంటర్ అమ్మాయిలాగా బేసిక్ హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్స్ అడక్కు

అందంగా ఉందని గోకొద్దు.. అమాంతం మింగేసి అస్థిపంజరం బయటకి తీస్తది..

78 సంవత్సరాలలో ఒకసారి జరుగుతది ఇలాంటి కలయిక.. ఒక మసూద, ఒక కాంచన.. ఒక బ్లాక్ మ్యాజిక్.. ఒక రెడ్ సిగ్నల్.

నల్లచీర : ఏ ఫిల్మ్ బై రాధిక.. చాలా పెద్ద డైరెక్టర్.. కథలు మస్తు చెప్తది.

నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్‌ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేయడానికి టిప్పు సుల్తాన్‌ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ..

లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు?
టిల్లు : నిలబడా నేను.. వేస్ట్‌. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్‌ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి.

టిల్లు:  నీకు ఒకటి చెప్పాల్నా.. టిల్లు అనేటోడు నార్మన్‌ హ్యూమన్‌ బీయింగ్‌ అయితే కాదు. నేనొక కారణజన్ముడ్ని.

ఫ్రెండ్స్‌ అందరితో కలిసి ఓ సినిమా చూసినా.. ఇట్స్‌ ఏ నల్లమల్ల ఫారెస్ట్‌.. విత్‌ నల్ల చీర.. ఫిల్మ్‌ బై రాధిక. చానా పెద్ద డైరెక్టర్‌ ఆమె.. భలే చెప్తది కథలు. ఓటీటీటీ.. ప్యాన్‌ మాల్కాజ్‌ గిరి మూవీ అది. దాని స్టోరీ ఏంటంటే లవ్‌, హార్ట్‌ బ్రేక్‌, హార్రర్‌, మిస్టరీ, థ్రిల్లర్‌, చీటింగ్‌, క్రైమ్‌ జానర్‌లో వచ్చింది.

ఇదో పెద్ద ఇలాకతా మఫిలియా కొంపరా ఇది ఇక్కడ ఎవరు ఎవరితో ఆడుకుంటుర్రో తెల్వదు గానీ.. ప్రతీసారి ఇంపాక్ట్‌ ప్లేయర్‌లాగా నన్ను మాత్రం దింపుతున్నారు రా. మా సైడ్‌ జోకర్ అంటారు’ 

టిల్లు: ఉన్నడా భాయ్‌ ఫ్రెండ్..
లిల్లీ: నీకెందుకు..?
టిల్లు: హా.. ఉంటే నా షూ నేను ఏసుకపోతా…
లిల్లీ: లేదంటే..
టిల్లు: నిన్ను ఏసుకోని పోతా..
లిల్లీ: అబ్బా… ఎక్కడికీ..
టిల్లు: నువ్వు ఏడికంటే ఆడికి..

ప్రతిసారి ఎక్కడ పడుతావ్‌రా… ఇలాంటి జంబల్ హార్ట్స్‌ లేడీస్‌నీ.. “ఎర్రిపప్ప అయ్యి.. అయ్యి ఆలసట రావడం లేదర నీకూ?… నీ యంకమ్మ..!

డాడీ… నీకు మార్కెట్‌లో ‘బెబ్స్‌’ ఎట్లున్నరో మినిమం ఐడియా కూడా లేదు నువ్వు మాట్లాడకు.. అమ్మసోంటి అమ్మాయిలు లేరు బయటా.. అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు.

నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి

లిల్లీ: పోయిన సారి ఆ రాధికకు బెయిల్ ఎందుకు ఇచ్చావ్.. ఈసారి లిల్లీని అరెస్ట్ ఎందుకు చేయించావ్?
టిల్లు: ఎందుకంటే ఆ రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది… ఈ లిల్లీ నన్ను మోసం చేయడానికే ప్రేమించింది.

Tillu Square Dialogues in Telugu - 2023

Tillu Square Dialogues in Telugu – 2023

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading