తూరుపు పడమరలకే… దూరమే కాస్త తగ్గినదే
తీరులో కొత్త మలుపే… తియ్యని మార్పు తెచ్చినదే
తేరు వేరైన కథలే… ఇక చేరువై నేడు కదిలే
మౌనమై ఉన్న ఎదలే… మాటలే కలిపినవిలే
తూరుపు పడమరలకే… దూరమే కాస్త తగ్గినదే
తీరులో కొత్త మలుపే… తియ్యని మార్పు తెచ్చినదే
చిలిపి చిలిపి తగువుల్లో
చిగురు తొడిగే ఒక చెలిమే
చిలికి చిలికి కలతల్లో
చెదిరి పడెనుగా అహమే
పిలిచి పిలిచి పిలుపుల్లో
పరిచయములు పెరిగినవే
నడిచి నడిచి అడుగుల్లో
పయనమిచట మారినదే
మనసుకైనా తెలియని
మహిమ ఏదో జరిగెనే
నిమిషమైనా కదలని
తుంటరి తుంటరి హాయిదే
తూరుపు పడమరలకే
దూరమే కాస్త తగ్గినదే
తీరులో కొత్త మలుపే
తియ్యని మార్పు తెచ్చినదే