Menu Close

మీ జీవితాన్ని మార్చే పుస్తకం – “ది పవర్ ఆఫ్ నౌ” – The Power of Now – Book Recommendations


మీ జీవితాన్ని మార్చే పుస్తకం – “ది పవర్ ఆఫ్ నౌ” – The Power of Now – Book Recommendations

  • రచయిత: ఈకార్ట్ టోలే
  • ప్రచురణ: 1997
  • విక్రయాలు: 3 మిలియన్ల పైగా

ఈ పుస్తకంలో ఏముంది?

“ది పవర్ ఆఫ్ నౌ” మన జీవితంలో ఎక్కువగా గతం గురించి లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ పుస్తకం “ప్రస్తుతం”లో ఉండడం ద్వారా నిజమైన ఆనందం, శాంతిని పొందవచ్చు అని చెబుతుంది.

ది ఆల్కెమిస్ట్ – ప్రపంచం మొత్తం నీకు సహాయం చేస్తుంది – The Alchemist – Book Recommendation

ఎందుకు చదవాలి?

మీరు మీ ఆలోచనలను కంట్రోల్ చేయాలనుకుంటే, జీవితాన్ని మరింత సింపుల్‌గా, ప్రశాంతంగా మార్చుకోవాలనుకుంటే, ఈ పుస్తకం మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. “ప్రస్తుతంలో” ఎలా జీవించాలో దీనిలో చాలా సరళంగా చెప్పారు.

ముఖ్యమైన విషయాలు:

ప్రస్తుతంలో ఉండటం (Present Moment):

  • మన జీవితంలో ఎక్కువ భాగం గతం గురించి బాధపడుతూ, భవిష్యత్తు గురించి భయపడుతూ గడుపుతాం.
  • నిజమైన సంతోషం, ప్రశాంతత ఈ “క్షణంలో” మాత్రమే ఉంటుంది. గతంలో జరిగిపోయిన విషయాలను మార్చలేం, భవిష్యత్తులో ఏమి జరగనుందో ఖచ్చితంగా చెప్పలేం.
  • అందుకే, మన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా గడపాలంటే ఈ క్షణాన్ని (NOW) అంగీకరించాలి.
  • “ఈ క్షణంలోనే నిజమైన జీవితం ఉంది” అని ఎఖార్ట్ టోలీ చెబుతారు.
  • ప్రతి క్షణాన్ని పూర్తిగా అనుభవించడం వల్ల, మనిషి మానసికంగా శాంతిని, ఆనందాన్ని పొందుతాడు.

ఈగో (Ego):

  • ఈగో అంటే మనలోని ఒక భావన, మన వ్యక్తిత్వానికి, పేరు-పదవులకు, విజయాలకు మనం ఇచ్చే ప్రాధాన్యత.
  • మనకు ఎప్పుడూ ఇతరుల కంటే మంచి అని నిరూపించుకోవాలనే కోరికే ఈగో. ఇది మనలో తప్పుడు గుర్తింపుని కలిగిస్తుంది.
  • ఈ “ఈగో” మనకు ఎక్కువ బాధ, ఒత్తిడి, అశాంతి కలిగించే ప్రధాన కారణం.
  • ఈగోని గుర్తించడం అంటే, మన మనసులో ఎప్పుడూ పోరాడుతున్న గొంతుకను గమనించడం.
  • ఒకసారి మన ఈగోని గుర్తిస్తే, అది మనపై ప్రభావం చూపదు. దాని నుంచి బయటపడటం సులభం అవుతుంది.
  • మనం ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న నిజమైన మనిషి, ప్రశాంతతను పొందాలంటే ఈగో నుంచి బయటకు రావాలి.

నెగిటివ్ భావాల నుంచి విముక్తి (Freedom from Negative Thoughts):

  • మనిషిలో చాలా సార్లు కోపం, అసూయ, బాధ, దిగులు, భయం వంటి నెగిటివ్ భావాలు ఏర్పడతాయి.
  • ఈ భావాలు మనకు ఎంతో మానసిక నొప్పిని, బాధను కలిగిస్తాయి.
  • పుస్తకం ప్రకారం, ఈ భావాలను నివారించడానికి వీలు లేదు, కానీ వాటిని మనసులో నిలుపుకోకుండా విడిచిపెట్టడం మన చేతిలో ఉంటుంది.
  • ఎఖార్ట్ టోలీ చెప్పేది ఏమిటంటే, “నీ భావాలను గమనించు. వాటిని వ్యతిరేకించకు, నెమ్మదిగా గమనిస్తే అవి వాటంతట అవే దూరమవుతాయి.”
  • నెగిటివ్ భావాలను గమనించి, వాటికి ప్రతిస్పందించకుండా చూస్తే, అవి నీ మీద ప్రభావం చూపలేవు.
  • ఇలా చేయడం వల్ల మనసు క్రమంగా ప్రశాంతంగా మారుతుంది.

ప్రశాంతత (Inner Peace):

  • ప్రశాంతత అనేది మనం బయట వెతికే వస్తువు కాదు, అది మనలోనే ఉంటుంది.
  • మనం ప్రశాంతంగా ఉండాలంటే, మనసులోని ఈగోని, నెగిటివ్ భావాల్ని విడిచిపెట్టాలి.
  • ప్రతి క్షణాన్ని అంగీకరించి, మనసులో ఉన్న అన్ని ఆలోచనలను పక్కన పెట్టి, “ఇప్పుడు” లో ఉండాలి.
  • మనసు ప్రశాంతంగా ఉంటేనే నిజమైన ఆనందాన్ని అనుభవించగలం.
  • ప్రశాంతత అంటే ఏమాత్రం ఆలోచనలు లేని స్థితి కాదు. అది మన ఆలోచనలను గమనిస్తూ, వాటితో ఏకమవ్వకుండా ఉండటం.
  • మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో, జీవితం అంత స్పష్టంగా, ఆనందంగా అనిపిస్తుంది.
  • ప్రశాంతతను సాధించడం కోసం ప్రతిరోజూ కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చోవడం, శ్వాసను గమనించడం, ఈ క్షణాన్ని ఆహ్వానించడం వంటి మార్గాలు పుస్తకం సూచిస్తుంది.

ఈ పుస్తకం చదివిన తర్వాత, జీవితాన్ని చూసే మీ విధానం మారుతుంది. నిజమైన ఆనందం, ప్రశాంతత మీకు దగ్గరవుతుంది.

Find the book here(ఇక్కడ చదవండి): “The Power of Now

రిచ్ డాడ్, పూర్ డాడ్ పుస్తకం నుండి కొన్ని ముఖ్యమైన పాఠాలు – Rich Dad Poor Dad in Telugu
ది ఆల్కెమిస్ట్ – ప్రపంచం మొత్తం నీకు సహాయం చేస్తుంది – The Alchemist – Book Recommendation

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Book Recommendations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading