Menu Close

The Life Of Ram Song Lyrics in Telugu – Jaanu


The Life Of Ram Song Lyrics in Telugu – Jaanu

ఏ దారేదురైనా… ఎటువెలుతుందో అడిగానా
ఏం తోచని పరుగై… ప్రవాహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా… నీ వెతికానా ఏదైనా
ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

కదలని ఓ శిలనే అయినా… త్రృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై… ఉంటానంటున్న
ఏదో ఒక బదులై నను చెరపొద్దని… కాలాన్నడుగుతు ఉన్నా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు
దయుంచి ఎవరు..!
ఇంకొన్ని జన్మాలకి సరిపడు… అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్మాలుగా తన వెన్నంటి
నడిపిన చెయ్యూత ఎవరిది

నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి

ఉదయం కాగానే… తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా
అనగనగా అంటూ నే ఉంటా… ఎపుడు పూర్తవనే అవకా
తుది లేని కథ నేనుగా

గాలి వాటం లాగా… ఆగే అలవాటే లేక
కాలు నిలవదు ఏ చోటా
నిలకడగ ఏ చిరునామా లేక
ఏ బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక, మౌనంగా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు
దయుంచి ఎవరు..!
ఇంకొన్ని జన్మాలకి సరిపడు… అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్మాలుగా తన వెన్నంటి
నడిపిన చెయ్యూత ఎవరిది

నా యద లయను కుసలము అడిగిన
గుసగుస కబురుల గుమగుమ లెవరివి

లోలో ఏకాంతం… నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా, విన్నారా
నేను నా నీడ… ఇద్దరమే చాలంటున్న
రాకూడదు ఇంకెవరైనా

అమ్మ ఒడిలో మొన్న.. అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది
జాబిల్లి అంత దూరానున్నా… వెన్నెలెగా చంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది, జోలాలి

తానే నానే నానినే… తానే నానే నానినే
తానే నానే నానినే… తానే నానే నానినే
తానే నానే నానినే… తానే నానే నానినే

The Life Of Ram Song Lyrics in Telugu – Jaanu

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading