Menu Close

The Kashmir Files Story in Telugu – Who are Kashmir Pandits? Untold Story of Kashmir – 1990

The Kashmir Files Story in Telugu – Who are Kashmir Pandits? Untold Story of Kashmir – 1990

దేశ విభజన తర్వాత కశ్మీర్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాకిస్థాన్ కశ్మీర్ ని ఆక్రమించుకోడానికి చాలా ప్రయత్నించింది. కశ్మీర్ అంటే స్వతంత్రం ముందు ఒక అందమైన ప్రదేశం, హిందువులకు, వేద బ్రాహ్మణులు, కశ్మీర్ పండిట్లు అంటూ స్వర్గంలా విరాజిల్లుతూ ఉండేది. కానీ స్వతంత్రం అనంతరం కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం వల్ల, ఉగ్రవాదుల వల్ల, పాకిస్థాన్ వల్ల కశ్మీర్ స్వరూపమే మారిపోయింది.

The Kashmir Files Story in Telugu – Who are Kashmir Pandits? Untold Story of Kashmir – 1990

The Kashmir Files Story in Telugu - Who are Kashmir Pandits? Untold Story of Kashmir - 1990

కశ్మీర్ లోని హిందువులపై పాకిస్తాన్‌, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణ కాండకు పాల్పడ్డారు. కశ్మీర్ పండిట్లను విచక్షణ రహితంగా చంపేశారు, ఆడవారిని మానభంగాలు చేసారు, చిన్న పిల్లలని కూడా చూడకుండా చంపేశారు. కశ్మీర్ ని స్మశానంగా మార్చారు. కశ్మీర్ లో ఉండాలంటే మతం మారాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అడ్డుకున్న వారిని చంపేసి వారి ఆస్తులను దోచుకున్నారు.

ఈ మరణకాండలో కొన్ని లక్షల మంది హిందువులు చనిపోయారు. సుమారు మరో 5 లక్షల మంది కశ్మీరీ పండిట్‌లు భయపడి వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. అయితే ఇదంతా చరిత్ర. ఇన్ని రోజులు పాలించిన రాజకీయ నాయకులు కూడా ఈ చరిత్రని బయటకి రాకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా కశ్మీర్ పరిస్థితులు మెరుగు పడుతున్నాయి.

The Kashmir Files Story in Telugu - Who are Kashmir Pandits? Untold Story of Kashmir - 1990

ఏటీవల రిలీస్ అయిన ‘ది కశ్మీర్ ఫైల్స్‌’ సినిమా కథలో కూడా1980-90లలో కశ్మీర్‌ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండ గురించే తెలుపుతుంది.

ఇలాంటి నిజాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పాలంటే, సినిమా రూపంలో తెరకెక్కించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వివేక్‌ అగ్నిహోత్రి ఈ చరిత్రని ‘ది కశ్మీర్ ఫైల్స్’ రూపంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఉన్న నిజాలని నిక్కచ్చిగా చూపించారు. ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి చిత్ర యూనిట్ కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని బెదిరించారు. డబ్బులు ఆశ చూపి సినిమాని ఆపేయమని కూడా ప్రయత్నించారు. ఓ వర్గం మత పెద్దలు ఈ చరిత్ర బయటకి రావొద్దని హెచ్చరించారు. కేసులు కూడా వేశారు. అయినా డైరెక్టర్, నిర్మాతలు, చిత్ర యూనిట్ ఎక్కడా భయపడకుండా సినిమాని తెరకెక్కించారు. రిపబ్లిక్ డే రోజు ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అప్పుడు థియేటర్లు క్లోజ్ ఉండటంతో ఇటీవల రిలీజ్ చేశారు.

సినిమా రిలీజ్ అయ్యాక డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ”కశ్మీర్‌లో 1990వ దశకంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలను ‘కశ్మీర్‌ ఫైల్స్‌’లో చూపించాం. కశ్మీర్‌లో జరిగిన అసలు సిసలైన వాస్తవాలు బయటకు రాలేదు. దేశ ప్రజలకు తెలియకుండా చేశారు. అందుకే బాధ్యతాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను. ఈ సినిమా నిర్మాణంలో నాలుగేళ్లపాటు చాలా కష్టనష్టాలు అనుభవించాను. మా చిత్రం చూసి నిజాలు తెలుసుకోండి’’ అని తెలిపారు.

The Kashmir Files Story in Telugu - Who are Kashmir Pandits? Untold Story of Kashmir - 1990

ఇక ఈ సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. కన్నీళ్లు పెడుతున్నారు. కశ్మీర్ నుంచి వెళ్లిపోయిన కుటుంబాలు ఈ సినిమా చూసి ఏడుస్తూ తమ జీవితాలని తెరపై చూపించారని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా చూసి ఒక మహిళ డైరెక్టర్ వివేక్‌ పాదాలు తాకి, సినిమా గురించి తన భావాన్ని వ్యక్తపరుస్తూ బిగ్గరగా ఏడ్చింది. ఆమె లాంటి ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకోవడం చూసి డైరెక్టర్‌, నటులు సైతం కంటతడి పెట్టుకున్నారు.

దేశ రాజకీయ నాయుకులు కూడా ఈ సినిమా గురుంచి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారు ఈ సినిమా గురుంచి ప్రస్తావించారు.

The Kashmir Files Story in Telugu - Who are Kashmir Pandits? Untold Story of Kashmir - 1990

ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకుంటుంది. మొదట తక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా రోజు రోజుకి థియేటర్ల సంఖ్యని పెంచుతూ కలెక్షన్లని కూడా పెంచుకుంటుంది. కనుమరుగైన చరిత్రని కళ్ళకి కట్టినట్టు చూపించిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అనేకమంది ప్రముఖులు కూడా సినిమాని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది. ప్రతి ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా ఇది.

అసలు కాశ్మీరీ పండిట్లు ఎవరు ? ఎక్కడివారు? – Who are Kashmir Pandits ?

కశ్మీర్ విషయంలో ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తికి వీలు కల్పిస్తున్న 370 ఆర్టికల్ ని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో ఇక ఇప్పటివరకు ఈ రాష్ట్ర జనాభాలో ప్రత్యేక వర్గంగా ఉంటూ వచ్చిన కాశ్మీరీ పండిట్ల గురించి కూడా చెప్పుకోవలసిందే.. ఒకప్పుడు కాశ్మీరీ బ్రాహ్మణులుగా కూడా వీరిని వ్యవహరించేవారు. తొలుత ముస్లిముల ప్రాబల్యానికి ముందు వీరు ఈ రాష్ట్రంలో ‘ హిందూ కమ్యూనిటీగా ‘ నివసిస్తూ వచ్చారు.

The Kashmir Files Story in Telugu - Who are Kashmir Pandits? Untold Story of Kashmir - 1990

అయితే క్రమంగా ముస్లిముల ప్రభావం పెరగడంతో అనేకమంది ఈ కశ్మీర్ విషయంలో ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తికి వీలు కల్పిస్తున్న 370 ఆర్టికల్ ని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో ఇక ఇప్పటివరకు ఈ రాష్ట్ర జనాభాలో ప్రత్యేక వర్గంగా ఉంటూ వచ్చిన కాశ్మీరీ పండిట్ల గురించి కూడా చెప్పుకోవలసిందే.. ఒకప్పుడు కాశ్మీరీ బ్రాహ్మణులుగా కూడా వీరిని వ్యవహరించేవారు.

తొలుత ముస్లిముల ప్రాబల్యానికి ముందు వీరు ఈ రాష్ట్రంలో ‘ హిందూ కమ్యూనిటీగా ‘ నివసిస్తూ వచ్చారు. అయితే క్రమంగా ముస్లిముల ప్రభావం పెరగడంతో అనేకమంది ఈ మతంలోకి మారుతూ వచ్చారు. కొద్దిమందిని ఆయా ప్రభుత్వాలు కాశ్మీరీ హిందూ వర్గీయులుగా పరిగణించాయి. అలాగే అక్కడి సమాజం కూడా. 1557 లో నాడు కాశ్మీర్ ను ఆక్రమించిన అక్బర్ చక్రవర్తి.. వీరిని కూడా గౌరవించాడు. వీరి సంస్కృతి, ఆచార వ్యవహారాలు, తెలివితేటలు ఆయనను ఆకర్షించడంతో వీరికి ‘ పండిట్లు ‘ అంటూ దాదాపు బిరుదువంటిదిచ్చాడు.

ఆ తరువాత ఆఫ్ఘన్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించినప్పటికీ వీరిని కాశ్మీరీ పండిట్లుగానే పరిగణించేవారు. అయితే బహుశా వారి ప్రభావంతో చాలామంది ఇస్లామ్ మతంలోకి మారిపోయారు. క్రమేపీ స్థానికులు, మిలిటెంట్ల హెచ్ఛరికలతో,పెద్ద సంఖ్యలో కాశ్మీరీ పండిట్లు వలసపోవడం ప్రారంభమైంది. 1950 ప్రాంతంలో భూసంస్కరణలకు నాటి ప్రభుత్వం పూనుకొన్నప్పుడు స్థానికులు వీరికి ఆ ప్రయోజనాలు లభించకుండా అడ్డుపడ్డారు. ఒకవిధమైన వ్యతిరేక ఉద్యమం పెల్లుబుకడంతో చాలామంది సమీప రాష్ట్రాలకు వలస వెళ్లాల్సివచ్చింది.

The Kashmir Files Story in Telugu - Who are Kashmir Pandits? Untold Story of Kashmir - 1990

1981లో వీరి జనాభా కాశ్మీర్ లో అయిదు శాతానికి తగ్గిపోయింది. ఆ తరువాత ఈ వర్గాన్ని ముఖ్యంగా ముస్లిములు ‘ కాఫిర్లు ‘ గా వ్యవహరించేవారు. వారి బెదిరింపుల ఫలితంగా మహారాష్ట్రకు వలస వఛ్చిన వారిని బాలథాక్రే ఆదుకోవడం విశేషం. తమ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో వారి పిల్లలకు కొన్ని సీట్లు రిజర్వ్ చేసిన ఘనత పొందారు. అయితే 2008 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం కాశ్మీర్ కు తిరిగి వచ్ఛే యువ కాశ్మీరీ పండిట్లకు 1168 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. దీంతో చాలామంది తిరిగి ఈ రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ పండిట్ల భవితవ్యం ఎలా మారుతుందో చూడాలి.

ఏదేమైనా మనకు తెలియని దేశ చరిత్ర చాలా వుంది, అలానే మనం నిజమని నమ్ముతున్న విషియాల వెనుక ఎంతో అసత్య ప్రచారము వుంది, నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిది. జై హింద్జై భారత్Emotional Poetry

తప్పకుండా షేర్ చెయ్యండి, ఇది మన భాద్యత.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. contact@telugubucket.com

Like and Share
+1
3
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker

Refresh Page
x

Subscribe for latest updates

Loading

Rashmika Mandanna Images Sai Pallavi Photos Samantha Cute Photos Pooja Hegde Images Anupama Parameswaran Cute Photos