దిశల్ని మార్చుకున్న…ఎలాంటి దారిలో పోతున్న
మనస్సు మారుతున్న… గతాల జ్ఞాపకం ఏదైనా
సదా… నువ్వే కదా ప్రతిక్షణాన
సదా… ఎలాగ చూసిన
సంతోషాల రూపం నువ్వే… కదిలిన కన్నీటి ధారవే
నడిపిన బాణం నువ్వే… ముసిరిన భయాల నీడవే
మరొక్కసారి చూడు…
కలల్లో తేలుతున్న… అవేవో ప్రశ్నలే లోలోన
ఎలాంటి ఊహలైన… నువ్వైన పాత్రాలే ఎన్నైనా
ఎదో… తెలీని ఈ ప్రయాణమేదో
ఏటో… ముగింపనేదెటో
వెతికిన నిజం నువ్వే… కలిసిన ప్రపంచము నువ్వే
నడిచిన దారి నువ్వే… నిలిచిన తీరానివి నువ్వే
మరొక్కసారి చూడు…
నువ్వే ఇలా… ప్రతి కధ నువ్వేగా
నువ్వై మళ్ళి అన్ని రావా ఎదురుగా
నువ్వే ఇలా… ప్రతి కధ నువ్వేగా
నువ్వై మళ్ళి… అన్ని రావా ఎదురుగా
సదా… నువ్వే కదా ప్రతిక్షణాన
సదా… ఎలాగ చూసిన
మరొక్కసారి చూడు…
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.