ఆనందంగా వుండాలనేదే ప్రతి ఒక్కరి కోరిక – The Art of Happiness Book in Telugu
ఈ పుస్తకం మన జీవితంలో ఆనందాన్ని ఎలా పొందాలో, మనస్సులో శాంతి ఎలా ఏర్పరచుకోవాలో చెప్తుంది. ఆనందం మనలోనే ఉండే ఒక లక్షణం అని, దానిని బయటి నుంచి కాదు, మనలోపలి నుంచి అన్వేషించాలన్న సందేశాన్ని ఈ పుస్తకం బలంగా అందిస్తుంది.
పుస్తకం పేరు: The Art of Happiness
రచయితలు: 14వ దలాయ్ లామా (Dalai Lama), హోవర్డ్ సి. కట్లర్ (Howard C. Cutler)
ప్రచురణ సంవత్సరం: 1998
అమ్ముడైన కాపీలు: ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడయ్యాయి.

- ఆనందంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. అదే ప్రతి మనిషి లక్ష్యం.
- ప్రేమ, దయ, మంచితనంతో మెలిగితే మనసు తేలికగా, సంతోషంగా ఉంటుంది.
- బాధలు మన జీవితంలో వస్తాయి. అవి సదారణం అని వాటిని ఒప్పుకోవడమే మనశ్శాంతికి మొదటి మెట్టు.
- ప్రతి మనిషికి సహనం అవసరం. అది మన బలం.
- మనపై వచ్చిన విమర్శను అంగీకరిస్తే, మనం మెరుగవ్వడానికీ అవకాశం ఉంటుంది.
- మంచి సంబంధాలు ఉంటే మనం ఒంటరి అని భావన రాదు, సంతోషంగా జీవించగలుగుతాము.
- మనకి నిజంగా ఏం కావాలో తెలుసుకోవడం ముఖ్యం. మనలో మనమే ఓసారి ఆలోచించాలి.
- దొరకని వాటి కోసం పరుగు పెట్టడం కన్నా, ఉన్నదానితో సంతృప్తిగా వుండటం మనలో ఆనందాన్ని పెంచుతుంది.
- ఇతరుల బాధలను అర్థం చేసుకుని ఎంతో కొంత సాయమో, లేక ఓదార్పునో అందిస్తే మనకి సంతృప్తి దక్కుతుంది అలానే మనం మంచి వ్యక్తులమవుతాము.
- డబ్బు, హోదా వంటివి ఆనందం ఇస్తాయనుకుంటాం, కానీ అవి తాత్కాలికం మాత్రమే.
- ప్రతి రోజు మన ఆలోచనలపై దృష్టి పెట్టాలి. మనలో నెగటివ్ భావాలు ఉంటే వాటిని తొలగించాలి.
- మనమీద మనకు నమ్మకం ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కొనగలం.
- మన జీవితంలో ప్రతి వ్యక్తి ఏదోక సమయంలో ఏదో విధంగా అవసరమే. అవసరం వున్నా, లేకపోయినా అందరినీ గౌరవంగా చూడాలి.
- ఎవరికైనా మనస్ఫూర్తిగా క్షమిస్తే మన మనస్సు చాలా హాయిగా ఉంటుంది.
- చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని చూసే అలవాటు పెంచుకుంటే, జీవితం చాలా బాగుంటుంది.
ఈ పుస్తకం మనలో ఉండే తాత్విక భావనలను ప్రేరేపిస్తూ, జీవితాన్ని మరింత ప్రశాంతంగా చూడటానికి మార్గాన్ని చూపుతుంది. మనల్ని మనం అర్థం చేసుకోవడం, ఇతరులతో సానుభూతిగా మెలగడం ద్వారా మనలో ఆనందం పెరిగేలా చేస్తుంది.
ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది
ఇక్కడ పూర్తిగా చదవండి👇
The Art of Happiness
తెలుగులో చదవాలి అనుకునే వారి కోసం – The Art of Happiness
విజయం అంటే కేవలం లక్ష్యాన్ని చేరుకోవడం కాదు – Can’t Hurt Me in Telugu