Telugu Veera Levara Lyrics In Telugu – Alluri Seetarama Raju
ఓహో ఓ ఓహో ఓహో… ఓ ఓ ఓ ఓ ఓహో
తెలుగు వీర లేవరా… ఆఆ ఆఆ
ధీక్షబూని సాగరా… ఆఆ ఆఆ
తెలుగు వీర లేవరా… ధీక్షబూని సాగరా
దేశమాత స్వేచ్చ కోరి… తిరుగుబాటు చేయరా
తెలుగు వీర లేవరా… ధీక్షబూని సాగరా
దేశమాత స్వేచ్చ కోరి… తిరుగుబాటు చేయరా
ఆఆ ఆఆ… ఆఆ ఆఆ
ఒహో ఓ ఓ…
ధారున మారణకాండకు తల్లడిల్ల వద్దురా… ఆఆ ఆఆ
నీతిలేని శాసనాలు… నేటినుండి రద్దురా… ఆఆ ఆఆ
ధారున మారణకాండకు తల్లడిల్ల వద్దురా…
నీతిలేని శాసనాలు… నేటినుండి రద్దురా
నిదుర వద్దు బెదర వద్దు… నిదుర వద్దు బెదర వద్దు
నింగి నీకు హద్దురా… నింగి నీకు హద్దురా
ఆఆ ఆఆ ఆ హ ఆ… ఓ ఓ ఓ ఓహో ఓ
ఓఓ ఓ…
ఎవడు వాడు ఎచటి వాడు… ఎవడు వాడు ఎచటి వాడు
ఇటు వచ్చిన తెల్లవాడు… ఇటు వచ్చిన తెల్లవాడు
కండ బలం కొండ బలం… కబలించే దుండగీడు
కబలించే దుండగీడు…
మాన ధనం ప్రాణ ధనం దోచుకున్న దొంగవాడు
దోచుకున్న దొంగవాడు…
ఎవడు వాడు ఎచటి వాడు… ఎవడు వాడు ఎచటి వాడు
తగిన శాస్తి చెయ్యరా… తగిన శాస్తి చెయ్యరా
తరిమి తరిమి కొట్టరా… తరిమి తరిమి కొట్టరా
తెలుగు వీర లేవరా… ధీక్షబూని సాగరా
దేశమాత స్వేచ్చ కోరి… తిరుగుబాటు చేయరా
ఆఆ ఆఆ ఆ హ ఆ… ఓ ఓ ఓ ఓహో ఓ
ఈ దేశం ఈ రాజ్యం… ఈ దేశం ఈ రాజ్యం…
నాదే అని చాటించి… నాదే అని చాటించి
ప్రతిమనిషి తొడలుగొట్టి… శృంఖలాలు పగులగొట్టి
శృంఖలాలు పగులగొట్టి…
చురకత్తులు పదునుపెట్టి… తుది సమరం మొదలుపెట్టి
తుది సమరం మొదలుపెట్టి…
సింహాలై గర్జించాలీ… సింహాలై గర్జించాలీ
సంహారం సాగించాలీ… సంహారం సాగించాలీ
వందేమాతరం… వందేమాతరం
వందేమాతరం… వందేమాతరం
ఓహో ఓ ఓహో ఓహో ఓ
స్వాతంత్ర్య వీరుడా… స్వరాజ్య పాలుడా
అల్లూరి సీతారామరాజా… అల్లూరి సీతారామరాజా
స్వాతంత్ర్య వీరుడా… స్వరాజ్య పాలుడా
అల్లూరి సీతారామరాజా… అల్లూరి సీతారామరాజా
అందుకో మా పూజలందుకో… రాజా
అందుకో మా పూజలందుకో… రాజా
అల్లూరిసీతారామరాజా… ఆ ఆ… అల్లూరిసీతారామరాజా
ఓ ఓఓ ఓఓ…
తెల్లవాడి గుండెల్లో నిదురించినవాడా…
మా నిదురించిన పౌరుషాగ్ని… రగిలించినవాడా
తెల్లవాడి గుండెల్లో నిదురించినవాడా…
మా నిదురించిన పౌరుషాగ్ని… రగిలించినవాడా
త్యాగాలే భరిస్తాం… కష్టాలే భరిస్తాం
త్యాగాలే భరిస్తాం… కష్టాలే భరిస్తాం
నిశ్చయముగ నిర్భయముగ… నీ వెంటనే నడుస్తాం
నిశ్చయముగ నిర్భయముగ… నీ వెంటనే నడుస్తాం
నీ వెంటనే నడుస్తాం…
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.