Menu Close

స్వామీ, రామావతారం లో సీత మీ భార్య కదా! ఆమె నాకంటే అందంగా ఉండేదా?

ఒకసారి సత్యభామ శ్రీకృష్ణునితో…!!
స్వామీ.. రామావతారం లో సీత మీ భార్య కదా! ఆమె నాకంటే అందంగా ఉండేదా?’ అని అడిగింది. 

ఆ సమయం లో అక్కడే ఉన్న గరుడుడు కూడా 
ప్రభూ, నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించగలరా?’ అన్నాడు.

అదంతా అక్కడే ఉండి వింటున్న సుదర్శనుడు
(సుదర్శన చక్రం) కూడా.. ‘పరంధామా, అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చిపెట్టాను.
నాతో సరితూగు వారెవరైనా వున్నారా స్వామి’ అని  అడగడం జరిగింది.

ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకున్నాడు.
దీర్ఘంగా ఆలోచించి…….!

‘సత్యా, నువ్వు సీతగా మారిపో. నేను రాముణ్నవుతాను’ అన్నాడు.
‘గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతారాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా’.
చక్రమా,  నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించకుండా చూడు’ అంటూ ముగ్గురికీ మూడు బాధ్యతలు అప్పగించాడు. 

hanuman-rama-and-sita

గరుత్మంతుడు  వెంటనే హనుమంతుని వద్దకు వెళ్లి.. సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు. 
హనుమ ఆనందంతో పులకించిపోతూ…..
‘నేను నీ వెనుకే వస్తాను…నువ్వు పద’ అని గరుత్మంతుని సాగనంపుతాడు. 
ఈ ముసలి వానరం రావడానికి ఎంత కాలమవుతుందో కదా…అనుకొంటూ ఎగతాళిగా నవ్వి గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురుతాడు. 
కానీ  విచిత్రంగా ……. 
ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడంతో మారుతిని చూసిన గరుత్మంతునికి మతి పోతుంది. సిగ్గుతో తలదించుకొని మౌనంగా ఉండి పోతాడు.

ఇంతలో…….‘హనుమా’ అన్నపిలుపుతో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు. 
‘లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా?’
అని శ్రీరాముడు అడగ్గా…..
ఆ మాట విన్న హనుమ తన నోటి నుండి సుదర్శనుని (సుదర్శన చక్రం) తీస్తూ…..
‘ప్రభూ, ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు. ఎన్ని చెప్పినా వినకపోవడంతో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’అన్నాడు హనుమంతుడు రామునితో.
సుదర్శనుడు కూడా గరుడుని వలె అవమానంతో నేలచూపులు చూస్తూ ఉండి పోయాడు. 

ఇంతలో హనుమంతుని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్ర్తీ పై చూపు పడి….
‘స్వామీ, మీ పక్కనుండ వలసింది సాక్షాత్తు నా తల్లి సీతమ్మ కదా! మరి ఎవరీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువుగా సత్యభామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది. 

అలా కృష్ణ పరమాత్ముడు, ముగ్గురిలో మొగ్గ తొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయానికున్న విలువేమిటో తెలియ చెప్పడం జరిగింది .

నీతి :
ఈ రోజులలో కూడా కొంతమంది బంగారు గరిట(గోల్డెన్ స్పూన్), వెండి గరిట (సిల్వర్ స్పూన్).. నోట్లో పెట్టుకొని పుట్టినట్లు. 
తామే గొప్పవారము అని, మిగిలినవారు హీనులు,చేతగాని వారని భ్రమలలో బ్రతుకుతున్నారు… వాళ్లకు తత్వం బోధపడాలి అంటే,
“ఆ పరమాత్ముడు మళ్ళీ పుట్టాలేమో…,

ఎవరైనా గతాన్ని మరచిపోరాదు, వర్తమానాన్ని విస్మరించరాదు, భవిష్యత్తును అతిగా ఊహించరాదు.
ఇవి ఏవీ మన చేతిలోనివి కాదు అని మాత్రం గుర్తించాలి”.

లోకాసమస్తాః సుఖినోభవంతుః

తప్పకుండా ఈ పోస్ట్ ని షేర్ చెయ్యండి.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
వీరిలో మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks