ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ప్రేమకు, పెళ్లికి తేడా ఏమిటి – Telugu Stories
గురువుగారిని “ప్రేమకు, పెళ్లికి తేడా ఏమిట”ని అడిగాడు శిష్యుడు. ఆయన శిష్యుడితో, “గులాబీ తోటలోకి పోయి అన్నిటికన్నా పొడవైన గులాబీ మొక్కను తీసుకురా ! అయితే వచ్చేటప్పుడు, వచ్చిన దారిలో రాకూడదు” షరతు పెట్టాడు. శిష్యుడు గులాబీ తోటలోకి పోయి ఉత్తి చేతులతో వచ్చాడు.
కారణమేమిటని గురూజీ అడిగాడు శిష్యుడిని. “గులాబీ తోటలోకి వెళ్లగానే ఒక పొడవైన గులాబీ మొక్కను చూసాను. దానికన్నా పొడవైనవి ఉంటాయేమో అని ముందుకు సాగాను. అయితే అన్నీ పొట్టివే కనిపించాయి. కానీ వచ్చిన దారిలో రాకూడదు కాబట్టి ఉత్తి చేతులతో వచ్చాను.”
గురువుగారు, ” ప్రేమంటే అదే..!!!” అన్నాడు” ఈసారి పొద్దుతిరుగుడు పూలతోటలోకి పోయి అందమైన మొక్కను తీసుకుని రా! అయితే ఒక మొక్కను పీకిన తరవాత ఇంకోటి పీకకూడదు.”
ఈసారి పొద్దుతిరుగుడు తోటలోకి పోయి ఒక మొక్కను పీకి తీసుకుని వెంటనే వచ్చేసాడు. “ఇదే అందమైన మొక్కా ??” అని అడిగాడు గురూజీ. ” కాదు గురూజీ, గత అనుభవంతో, ఈసారి నేను దొరికిన అవకాశాన్ని ఒదులుకోదలుచుకోలేదు. కాబట్టి కళ్ళకు అందంగా కనిపించిన మొదటి మొక్కను తీసుకున్నాను.
దారిలో అందమైనవి ఇంకా చాలా కనిపించాయి. కానీ రెండో మొక్కను ఎంచుకునే అవకాశం లేదు కాబట్టి, దీనితోనే తృప్తిపడి వచ్చాను.” అన్నాడు శిష్యుడు. గురూజీ, “ఇదే పెళ్లి” నవ్వుతూ అన్నాడు.
ప్రేమకు, పెళ్లికి తేడా ఏమిటి – Telugu Stories