Menu Close

నాకేది సంతోషాన్ని ఇస్తుందో అదే చేస్తున్నాను – Inspiring Stories in Telugu


నాకేది సంతోషాన్ని ఇస్తుందో అదే చేస్తున్నాను – Inspiring Stories in Telugu

చాలా కాలం తరువాత నా మిత్రుడు కలిస్తే ఏరా 45 ఏళ్ళు దాటాయి మనకి. వయస్సు తో పాటు ఏమైనా ఆలోచనలో కూడా మార్పు వచ్చిందా అని క్యాజువల్ గా అడిగాను. అప్పుడు అతను అన్నాడు..

అవును నేను మారుతున్నాను, తల్లిదండ్రులను బంధువులను భార్యను పిల్లలను స్నేహితులను ఇన్నాళ్లు ప్రేమించాను. ఇప్పుడిప్పుడే నన్ను నేను ప్రేమించుకోవడం మొదలు పెట్టాను.

అవును నేను మారుతున్నాను, నేనేమీ ప్రపంచ పటాన్ని కాదు, ప్రపంచాన్నంతా నేనే ఉద్ధరించాలని అనుకోవడం లేదు.

అవును నేను మారుతున్నాను, కూరగాయల వాళ్లతో పండ్ల కొట్ల వాళ్ళతో బేరాలు ఆడటం మానేశాను. వాళ్లకు నాలుగు రూపాయలు ఎక్కువిచ్చినంత మాత్రాన నేను పెద్దగా నష్టపోయేది ఏమీ లేదని తెలుసుకున్నాను, ఆ డబ్బులు వాళ్ల పిల్లల స్కూల్ ఫీజు కన్నా పనికి వస్తాయి.

అవును నేను మారుతున్నాను, టాక్సీ డ్రైవర్ దగ్గర చిల్లర కోసం తగాదా పడటం లేదు. ఆ కాస్త చిల్లర అతని మొహంలో నవ్వులు పూయించడం నాకు ఆనందంగా ఉంది.

అవును నేను మారుతున్నాను, చెప్పిందే ఎందుకు చెబుతున్నావ్ అని పెద్దవాళ్ళను అడగడం మానేశాను. వాళ్లు గతాన్ని నెమరు వేసుకోవడానికి అది పనికి వస్తుందని గ్రహించాను.

అవును నేను మారుతున్నాను, తోటివారిలో తప్పు ఉంది అని తెలిసినా వారిని సరిదిద్దే ప్రయత్నం మానుకున్నాను. అందరిని సరైన దారిలో పెట్టే బాధ్యత నా ఒక్కడి భుజాలమీద లేదు అని తెలుసుకున్నాను. సమగ్రత కన్నా ప్రశాంతత ముఖ్యం.

అవును నేను మారుతున్నాను, ఉచితంగా, ఉదారంగా అభినందనలు అందరిపై కురిపిస్తున్నాను. అది వారితో పాటు నాకు ఆనందాన్నిస్తోంది.

అవును నేను మారుతున్నాను, చొక్కా పై పడ్డ మరకలు చూసి బెంబేలు పడటం మానేశాను. ఆకారం కన్నా వ్యక్తిత్వం ముఖ్యం అని తెలుసుకున్నాను.

అవును నేను మారుతున్నాను, నాకు విలువనివ్వని వారికి దూరంగా జరగడం నేర్చుకున్నాను. వారికి నా విలువ ఏమిటో తెలిసి ఉండకపోవచ్చు కానీ నా విలువ ఎంతో నాకు తెలుసు.

అవును నేను మారుతున్నాను, ఎవరైనా నన్ను తీవ్రమైన పోటీలోకి లాగాలని చూసినప్పుడు ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాను. నాకు ఎవరితో పోలిక పోటీ అవసరం లేదు.

అవును నేను మారుతున్నాను, నా భావావేశాలు నన్ను కలవర పెట్టకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నన్నుగా మనిషిగా నిలబెట్టేవి అవే.

అవును నేను మారుతున్నాను, ప్రతిరోజు అదే చివరి రోజు అన్నట్టుగా బతకడం నేర్చుకున్నాను. నిజానికి ఈరోజే చివరి రోజు కావచ్చు ఏమో..

అవును నేను మారుతున్నాను, నాకేది సంతోషాన్ని ఇస్తుందో అదే చేస్తున్నాను నా సుఖసంతోషాలకు నేనే… నేను మాత్రమే బాధ్యుడిని.

చాలా మందికి కనువిప్పు కలిగించే కథ – Emotional Story in Telugu

నాకేది సంతోషాన్ని ఇస్తుందో అదే చేస్తున్నాను – Inspiring Stories in Telugu

Like and Share
+1
1
+1
2
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading