ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
రంగడికి పొద్దున్నే కలొచ్చింది..పదేళ్ల క్రితం పోయిన వాళ్లమ్మ..లీలగా.. ఏదో కావాలని అడిగింది…ఇంతలో మెలకువ…గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నించాడు.. కలలో ఏం జరిగిందని.. అమ్మ ఏదో చెబుతోంది.. గుర్తుకి రావట్లేదు..తన భార్య రమ్యతో చెప్పాడు.. తన అన్నకి చెప్పాలనుకున్నాడు.. అమ్మ కలలో వచ్చిందని.
రెండేళ్లుగా రెండు కుటుంబాలకీ మధ్య మాటలు లేవు..అన్నావదినలతోనే పెరిగాడు. తనకి పెళ్లైన తరువాత కూడా..రమ్య అందరితో కలిసిపోయింది.కాని, ఎందుకో..చిన్న చిన్న విభేధాల వల్ల…..రెండు కుంటుంబాల మధ్య దూరం పెరిగింది.. బాగా పెరిగింది.వారం రోజులు గడిచింది. అమ్మ మళ్లీ కలలోకొస్తే బావున్ను…ఏంచెబుతోందో తెలుసుకోవాలనుకుంటున్నాడు..కాని అమ్మ రావట్లేదు కలలోకి.
అమ్మ ఫొటో దగ్గరకి వెళ్లాడు.. అమ్మని తదేకంగా చూసాడు. ‘అమ్మా మళ్లీ కనిపించమ్మా.. మాట్లాడలనుంది’..నెల గడిచింది. అమ్మ కలలోకి రాలేదు. ఊహించుకున్నాడు.. కలలో వస్తుందని.. తెలుసు ఊహలు మనం ఎలాగైనా ఊహించేవి. కలలు వాటంతట అవి వచ్చేవి. అమ్మ కలలో వస్తే బావున్ను.ఆర్నెళ్లు గడిచాయి.. అమ్మ కలలోకి రాలేదు. రంగడికి మనసు కుదుటబడట్లేదు..
కానీ ఎందుకో రంగడికి తోచింది.. పదేళ్ల క్రితం పోయిన అమ్మని తీసుకురాలేడు. ఫొటోతో మాట్లాడుతున్నాను. అందుబాటులో ఉన్న అన్నతో ఎందుకు మాట్లాడం లేదు.. అన్నతో మాట్లాడవచ్చు. స్పృశించవచ్చు.. అన్నతో కలవచ్చు.. అన్నావదినలతో, వాళ్ల పిల్లలతో సరదాగా ఉండచ్చు.. అన్నీ చేయచ్చు. అమ్మతో ఇవేవీ చేయలేను.. అవును..ఉన్న వాళ్లతోనే ఏదైనా చేయచ్చు.. ఈ ఆలోచనే చాలా అందంగా అనిపించింది రంగడికి.. వెంటనే phone చేసాడు..అన్నయ్యా మేము వస్తున్నాము. కలసి భోంచేద్దామని చెప్పాడు. అందరూ కలసిపోయారు. ఆనందంగా ఉన్నారు.రంగడు అమ్మకి నమస్కరించాడు. అమ్మే ఈ ఆలోచన కలిగేలా చేసింది.
పోయినోళ్లు అందరూ ఎంతో మంచోళ్లు. ఉన్న వాళ్లతోటే మనం ఉండగలిగేది. మానవ సంబంధాలు అత్యవసరం. అనుబందాలు పెద్దల ఆస్తి. అందరికీ చెందాలి.