Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu
నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి
సాయంసంధ్యా వేల, చల్లగాలికి సేద తీరదామని మేడ మీదకు వెళ్ళా, పల్లెటూరు కావడంతో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంది, పేరుకి పల్లెటూరు అయినా అందరూ మంచిగా స్థిరపడ్డారు. మా ఊరిలో మీకు ఒక్క పూరి గుడిస కూడా కనిపించదు.
అలా కుర్చీలో కూర్చిని ఒక చేతిలో వెచ్చని కాఫి కప్పు పట్టుకుని ఆ చల్లగాలిలో ఆస్వాదిస్తూ తాగుతున్నా.. ఒక పక్క సూర్యుడు దోర ఏరుపు రంగుతో చాలా అందంగా కనిపిస్తున్నాడు.. మరో పక్క పక్షులు గుసగుసలాడుతూ వాటి గూడ్లకు చేరుకుంటున్నాయి. నా చూపు వాటిని వెంబడించింది అలా నా చూపు ఎదురింటి మేడ మీదకు వెళ్ళింది.
అక్కడ అక్కాచెల్లెలిద్దరూ కుదురుగా కూర్చుని వున్నారు. వాళ్ళతో పాటు ఇంకో ఇద్దరూ పిల్లలు కూడా వున్నారు. కనిపించినప్పుడల్లా “అన్నయ్యా అన్నయ్యా” అని వదలరు.
పెద్దదాని పేరు ఉష, చిన్నదాని పేరు సంధ్య.
ఉష వయసు 10 సంవత్సరాలు వుంటాయి.
సంధ్యకి ఒక 7 సంవత్సరాలు వుంటాయి,
పెద్దదాని చేతిలో బెత్తం వుంది. చిన్నదాని చేతిలో పుస్తకం వుంది.
ముచ్చటేసింది, ఎంత బుద్ధిగా చదువుకుంటున్నారో అనుకున్నా.. ఇంతలో మా అమ్మ వచ్చింది అమ్మా వాళ్ళని చూడు ఎంత బుద్దిగా చదువుకుంటున్నారో అన్నా… “వాళ్ళు చదువుకోవట్లేదు నాన్న ఆడుకుంటున్నారు అంది” అమ్మ.
ఏంటి ఆడుకుంటున్నారా అదేమి ఆటమ్మా అన్నా..
“ఎదో టీచర్ ఆట అంటరా, ఆ టీచర్ ఈ పిల్లలందరకి ఒక పాఠం ఇస్తుంది. అది చదివి అప్ప చెప్పాలంట..”
బాగుంది కదా ఆట..
“అందులో ఎవరైతే మొదటిగా పాఠం అప్ప చెప్తారో వాళ్ళు ఆ తరువాత టీచర్ అవుతారంట
అలానే మిగతా పిల్లలు ఒకొక్కరుగా టీచర్ అవుతారు ఒక్కో పాఠం ఇస్తారు అందరూ చదివి అప్ప చెప్పాలి”
చాలా బాగుంది కదా..ఆట, ఈ ఆట అసలు ఎలా పుట్టిందో తెలియదు కాని.. పిల్లలకి నచ్చని ఒక పనిని ఆటలాగా ఆ పిల్లలకి అలవాటు చెయ్యడం చాలా మంచిగా అనిపించింది… అలానే ఆ పిల్లలకి చిన్నప్పటి నుండే ఒక గ్రూప్ ని ఏలా హ్యాండిల్ చెయ్యాలో తెలుస్తుంది.
చాలా మంది పిల్లలు కొన్ని కొన్ని పనులను చెయ్యడానికి ఇష్టపడరు. అలాంటి పిల్లలకి వాళ్ళు ఇష్టపడే విదంగా ఇలాంటి ఆటలను సృష్టించి వాళ్లకు అలవాటు చేస్తే చాలా బాగుంటుంది.
రచన : సురేష్ సారిక
ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి, అలానే తప్పకుండా షేర్ చెయ్యండి…
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.