ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Stories, Telugu Kadhalu, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu
నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి
సరోజిని మనసు ఎందుకో ఉదాసీనంగా ఉంది. ఎక్కడో సముద్రంలో రేగిన తుఫాను వల్ల ఆకాశం మబ్బుపట్టి బూడిదరంగులో కనిపిస్తూ మనసుని మరింత దిగులుగా చేస్తుంది. గోపాలం అప్పుడే బయటినుండి వచ్చాడు. కొంచెం టీ చేస్తావా త్వరగా. చాలా చలిగా అనిపిస్తుంది కదా అంటూ గదిలోకి వెళ్ళాడు.
కదలబుద్ధి కాకున్న లేచి టీ చేసి తెచ్చింది.అన్నట్టు ఈరోజు అమ్ము పుట్టినరోజు కదా.మాట్లాడావా అమ్ముతో.ఏవిటి విశేషాలు… తీరిగ్గా టీ సిప్ చేస్తూ ప్రశ్నించాడు. అందుకోసమే ఎదురు చూస్తున్నట్లు ఠక్కున అందుకుంది సరోజిని.ఆ,మాట్లాడాను లెండి.అమ్ము అత్తారింట్లో అడుగుపెట్టి రెండునెలలు కాలేదు. పుట్టినరోజుకి రమ్మన్నా రాలేదు.ఈరోజు వాళ్ళత్తగారు చాలా ఘనంగా అమ్ము పుట్టినరోజు చేస్తుందట.
మంచి డ్రెస్,మాచింగ్ ఏక్సెసరీస్ కొన్నాదటావిడ అమ్ముకోసం.సాయంత్రం ఇంట్లోనే పార్టీ ఎరేంజ్ చేస్తారట..అల్లుడు కూడా అమ్ముకి షూస్,హాండ్ బ్యాగ్ కొన్నాడట.. భార్య మాటలు విని చాలా సంతోషించాడు గోపాలం.
మన అమ్ము చాలా అదృష్టవంతురాలు. మంచి సంస్కారం ఉన్న అత్తిల్లు దొరికింది. ఇక మనం నిశ్చింతగా మన శేషజీవితం గడిపెయ్యవచ్చు ‘ సంతోషంగా అన్న భర్త వైపు అసహనంగా చూసింది సరోజిని. అంటే ,ఇక మనమ్మాయితో మనకేమీ సంబంధం లేనట్లేనా.
ఇన్నాళ్ళు అల్లారుముద్దుగా పెంచి పెళ్ళిచేసి అత్తవారింటికి పంపించాం. ఇందాక ఫోనులో అమ్ము అన్నదికదా ‘అమ్మా,మా అత్తగారు ఎంతో అభిమానంగా చూసుకుంటుంది.నాకు ఒక గైడ్,స్నేహితురాలిలా ఆవిడ నాకు అన్నీ చెప్తూ సహాయంగా,తోడుగా ఉంటారు.నువ్వు నా గురించి కంగారుపడకు. నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను ‘అంటున్నది…గొంతులో ఒకవిధమైన బాధ తొణికిసలాడింది.
అందుకు మనం చాలా సంతోషపడాలి.మన అమ్ము అత్తవారింట్లో బాగా అడ్జస్ట్ అయిపోతున్నట్లే. అత్తగారింట్లో సంతోషంగా లేనని చెప్పిందనుకో,నువ్వెంత బాధపడతావు.మనం ఇలా నిశ్చింతగా మాట్లాడుకోగలమా?అన్నాడు గోపాలం.నాకూ చాలా సంతోషంగానే ఉందండి.మనం అన్నివైపులా కనుక్కుని మనమ్మాయికి మంచి సంబంధమే చేశాం.అమ్ము సంతోషంగా ఉంది.
అదే నాక్కావాలి.కానీ ఇక మన అమ్ము మనకి పరాయిదయిపోతుందా? అత్తింటి ప్రేమలో పుట్టిల్లు మర్చిపోతుందా? అమ్ము లేని ఇల్లు నాకు శూన్యంగా అనిపిస్తుంది. అమ్ముతో పాటే ఈ ఇంటి కళాకాంతి తన అత్తవారింటికి తరలిపోయిందనిపిస్తుంది…నిరాశగా వడిలిపోయిన భార్య ముఖం చూసి మెల్లగా మాట్లాడటం మొదలుబెట్టాడు గోపాలం” సరోజా,అమ్ము లేని ఇల్లు నీకే కాదు నాకూ శూన్యంగానే తోస్తుంటుంది.
కానీ ఇలాగ అనిపించేది కొన్నాళ్లే.తరువాత మనం ఈ జీవితానికి అడ్జస్ట్ అయిపోతాం.అమ్ము అత్తవారింటి కబుర్లు సంతోషంగా వింటాం.అందరికీ ఆనందంగా అమ్మాయి గురించి చెప్పుకుని గర్వపడతాం. అప్పుడప్పుడు మనం వెళ్లి అమ్ముని చూసివస్తాం.అమ్ము కూడా వస్తూపోతూ ఉంటుంది. మనం మన బాధ్యత సక్రమంగా నెరవేర్చామని తృప్తిగా బ్రతుకుతాం.
ఒకమాట.. ఎంతమంచి అత్తవారు దొరికినా అమ్మాయి మనసులో మనకున్న స్థానం వేరెవరికీ దొరకదు.అమ్మాయికే కాదు మనందరికీ మన మనసుల్లో తల్లిదండ్రులకిచ్చిన గొప్పస్థానం వేరెవ్వరికీ ఇవ్వం.ఇది మాత్రం అక్షరాలా నిజం.నువ్విన్నాళ్ళు అమ్ముని పెంచడం,తీర్చిదిద్దడంలో కాలం గడిపావు .ఇపుడు అమ్ము బాధ్యత తీరింది కానీ మన శేషజీవితాన్ని గమ్యంవైపు ఫలవంతంగా నడుపుకునే బాధ్యత మనకు ఉంది…ఆగాడు.
నన్నేం చేయమంటారు.నా మనసు ఎక్కడా లగ్నం కావడం లేదు… నిర్లిప్తంగా అన్నది సరోజిని. అరె, ఆ నిర్లిప్తతే వదిలిపెట్టు.నీకు తోటపని ఇష్టం కదా.మన ఇంటిపెరటిలో,మిద్దె మీదా రకరకాల మొక్కలు పెంచుదాం.
చిన్న కుక్కపిల్లని పెంచుకుందాం. చెట్ల క్రింద ధాన్యం గింజలు చల్లుదాం.పక్షుల కిలకిలారావాలతో మనతోట సందడి సందడిగా మారిపోతుంది.అప్పుడప్పుడు వేరే ప్రదేశాలకి తిరగడానికి వెళదాం..ఇంకా.. అంటూ ఏదో చెప్పబోతున్న భర్తని ఆపింది.ఇక చాల్లెండి. మీ మాటలే నా దిగులు పోగొట్టాయి. ఇక మిగిలింది ప్రకృతితో చెలిమిచేస్తూ గమ్యంవైపు సాగిపోవడమే..అని నవ్వుతూ ఉత్సాహంగా వంటపని పూర్తి చేయడానికి కిచెన్ లోకి వెళ్ళింది సరోజిని ఈరోజు భర్త కిష్టమైన గుత్తివంకాయ కూర చేయడానికి నిర్ణయించుకుని ఆ పనిలో నిమగ్నమైంది.