Menu Close

సహనం – వృత్తి – దైవం – అమెరికా దేశాధ్యక్షుడైన అబ్రహం లింకన్

ఎన్నో కష్టాల తర్వాత అమెరికా దేశాధ్యక్షుడైన అబ్రహం లింకన్ తొలిసారి సభలో ప్రసంగానికి సిద్దమవుతున్నపుడు ఓర్వలేని ఒక ఐశ్వర్యవంతుడు అతన్ని ఎలాగైనా అవమానించాలని అనుకోని తన కాలికున్న బూటుని విప్పి లింకన్ కి చూపిస్తూ ఇది మీ తండ్రి కుట్టిన బూటు.. చెప్పులు కుట్టే వాడి కొడుకైన నీవు ఈ రోజు మా లాంటి పెద్దవాళ్ళను ఉద్దేశించి ప్రసంగిస్తున్నావా అంటూ తన ఆక్రోశాన్ని, అసూయని వెళ్లగక్కాడు.

వాస్తవానికి లింకన్ తానున్న ఉన్నతమైన స్థితిలో అలాంటి మాటలు అన్న వ్యక్తిని వెంటనే పోలీసులను పిలిపించి అరెస్ట్ చేయించవచ్చు. కానీ లింకన్ అలా చేయలేదు. వెంటనే అతనికి సెల్యూట్ చేసి ఇంత మంది పెద్దల సభలో తన తండ్రిని గుర్తు చేస్తున్నందుకు నేను మీకు రుణపడి ఉంటాను.

ఈ సభలో మీ బూట్లే కాదు ఎంతో మంది బూట్లను నా తండ్రి కుట్టి ఉండవచ్చు. నా తండ్రి వృత్తినే దైవంగా భావించాడు. అలాంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నానని చెప్పాడు. ఒకవేళ నా తండ్రి కుట్టిన బూట్లలో ఏమైనా తేడా ఉంటె చెప్పండి.

నా తండ్రి నాకు బూట్లు కుట్టడం నేర్పాడు. వాటిని మీ ఇంటికి వచ్చి నేను సరి చేస్తాను ఎందుకంటే నా తండ్రికి అప్రతిష్ట రావటం నాకిష్టం లేదని చెప్పి ఆనందభాష్పాలతో తన ప్రసంగాన్ని ఆరంభించాడు. అంతే అవమానపరుద్దామని అనుకున్న ఆ ఐశ్వర్యవంతుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సహనం మనకు సరైన మార్గం చూపిస్తుంది.

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks