Menu Close

మీ లక్షణాలను వీడకండి

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

అనగనగా ఒక ఊరి లో ఒక సాధువు ఉండేవారు ఒకరోజు ఆ ఊరి నుండి వేరే ఊరి కి వెళ్తున్నాడు. మార్గ మధ్యములో అతనికి ఒక గడ్డి వామి దగ్గర ఒక కోడె వయసు ఉన్న నాగు పాము కనిపించింది. సాధువు అలికిడి వినాగానే నాగుపాము తోక పైన అంతయెత్తున లేచి పడగ విప్పి బుస కొడుతూ కరవ బోయింది.

అప్పుడు సాధువు అన్నాడు “ఓ నాగరాజ నీకు తెలుసా నీవు అన్యాయంగా ఈ దారి వెంబడి వెళ్తున్న ఎంతో మంది అమాయకులను నీకు ఏమి అపకారం చేయకున్నా… నీ అజ్ఞానం తో నీ విషపు కోరలతో కరిచి చంపేస్తున్నావు దీని వల్ల నీవు పాపం లో పడి పోతున్నావు ” అని వెళ్ళిపోయాడు.

దానికి నాగరాజు ఒకింత ఆలోచన చేసి నిజమే నేను చేస్తున్నది తప్పే అని గ్రహించి ఆ రోజు నుండి అటు వైపు ఎవ్వరు వెళ్లిన కాని చూస్తూ పక్క నుండి వెళ్ళేది కాని ఎవ్వరికీ ఎలాంటి హాని తలపెట్టడము లేదు. ఇది గమనించిన కొంతమంది తుంటరి పిల్లలు నాగరాజు గారి పైన రాళ్లు విసిరి గాయ పరిచేవారు అయిన కుడా నాగరాజు కిమ్మనకుండా ఉండి పోయేది.

కొన్ని రోజుల తర్వాత సాధువు అదే దారి గుండ వెళ్తూ గడ్డివామి దగ్గర బక్క చచ్చి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న నాగరాజు ను చూసి విస్తూ పోయి అడిగాడు ఏమి నాగరాజు గారు ఇలా అయిపోయారు! అని…. దానికి నాగరాజు గారు” మీరే కదా స్వామి ఆ రోజు ఈ దారి వెంబడి వెళ్తూ అన్యాయంగా ఎవ్వరిని కర వొద్దు అని చెప్పారు కదా ఎవ్వరికి ఎలాంటి హాని సల్పాకుండా ఉన్నాను దాని పర్యవసనమే ఇలా అయింది “అంది.

దానికి సాధువు గారు ఏమన్నారంటే “నేను కరవొద్దు అన్నాను కాని బుస కొట్టవద్దు అనలేదు కదా” అని వెళ్ళిపోయాడు.

Like and Share
+1
1
+1
0
+1
0

Subscribe for latest updates

Loading