అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
ప్రతి ఫలం*
తండ్రీ కొడుకులు కలసి వ్యవసాయం చేసేవారు.
అడిగిన వారికి అన్నం పెట్టి అన్నదాత అనిపించుకున్నాడు. అర్ద రాత్రి ఎవరికైనా జబ్బు చేస్తే, బండి కట్టి పట్నంలో ఆసుపత్రికి చేర్చేవాడు.
తండ్రి పద్దతులు కొడుకు సూరికి నచ్చేవి కావు.
“ఎందుకు పరాయి వాళ్ళ కోసం అలా పాకులాడతావు? మనకు అవసరం పడితే ఒక్కడూ ముందుకు రాడు. మొన్న నా కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఒక్కడూ బండెక్కించుకోలేదు. కృతజ్ఞత లేని వారికోసం పాటుబడటం శుద్ధ దండగ” అని కోపగించుకునేవాడు.
నాలుగు రోజుల తరువాత పంపు విరిగి సుబ్బయ్య పండిన చేలోకి నీరు పోసాగాయి.
అది చూసిన తండ్రి పంపు కట్టేసి రమ్మన్నాడు.
మొన్న జరిగింది చెప్పాడు.
“ఎవడి పాపాన వాడు పోతాడు. కోత కొచ్చిన పంట తడిచిపోతే ,పాడయిపోతుంది చూస్తూ వుంటే వాడికి మనకు తేడా ఏముంది?” కోపంగా అన్నాడు.
తండ్రి చెప్పినట్టే చేశాడు.
ఆ ఏడు పంటలు బాగా పండాయి. వడ్లు బస్తాలకెత్తి , ఇంటికి చేర్చాడు సూరి.
ఊరెళ్ళిన తండ్రి అప్పుడే వచ్చాడు.
ఎద్దుల గంగ డోలు నిమురుతూ”నాన్నా! ధాన్యం బస్తాలు బండికెత్తి దారిన వస్తుంటే, రెండు చక్రాలు గుంటలో ఇరుక్కు పోయాయి. బండి బరువుకు వెనక్కి వాలి ముందు లేచింది. ఎద్దులు పైకి లేచాయి. వాడి కుత్తుకల దగ్గర బిగుసుకుంది. తనకలాడు తున్నాయి.
నేనొక్కడినే ఉన్నాను ఏం చేయాలో పాలుపోలేదు.
అంతలో ఆ దారిన పోతున్న పెళ్ళి బృందం, గబగబా వచ్చి,ఎద్దులను పట్టుకుని పైకెత్తారు. నేను వాటి మెడతాళ్ళు తప్పించాను. ఈ రోజు ఎద్దుల ప్రాణాలు గట్టివి”అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు సూరి.
“చూశావా!భగవంతుడు ఎంత సహాయం చేశాడో! నీవు సహాయం చేసిన వాళ్ళే నీకు సహాయం చేయాలని లేదు. నువు ఎవరికి మంచి చేసినా, దేవుడు నీ ఖాతాలో వేస్తాడు. పెళ్ళి వారికి నువ్వేం సాయం చేశావని వాళ్ళు కాపాడారు. ప్రతి ఫలం ఆశించక పదిమందికి సాయం చేస్తే అదే మనల్ని కాపాడుతుంది.”
ఇంతకాలం మొండిగా వాదించి నందుకు తండ్రి ని మన్నించమని కోరాడు మన సూరి.
జంజం కోదండ రామయ్య.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు