Menu Close

దేవుడి ఉనికి ఎవరికి వారు గా తెలుసుకోవాల్సిందే – Telugu Stories about God

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

ఒక గురువు తన వద్దకు వచ్చిన ఒక వ్యక్తితో “దేవుడు ఉన్నాడా? లేడా?? నీవు సిద్దమేనా???”
అని అడిగాడు. దానికా వ్యక్తి “ఇప్పుడే మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను. ఇక మీరు ప్రారంభించండి” అని వినయంగా చెప్పాడు..
🦜వెంటనే గురువు వేరొక శిష్యుని పిలచి చెవిలో పంచదార కలిపిన నీరు ఒక గ్లాసుతో తెమ్మని చెప్పాడు శిష్యుడు తెచ్చాడు… ఇపుడు గురువు మరియు వచ్చిన వ్యక్తికి మధ్య సంభాషణ ఇలా…

🦜గురువు : ఈ గ్లాసులో ఏముంది?
🦜శిష్యుడు: మంచి నీరు.
🦜గురువు: సరిగా చూసి చెప్పు, కేవలం మంచి నీరేనా?
🦜శిష్యుడు : అవును గురువు గారు, కేవలం మంచి నీరే.
🦜గురువు: అయితే ఒకసారి త్రాగి చెప్పు..
🦜శిష్యుడు నీటిని త్రాగాక..
🦜గురువు:- ఇప్పుడు చెప్పు అది ఏ నీరు?

🦜శిష్యుడు: -గురువు గారూ ఇది పంచదార కలిపిన నీరు..
🦜గురువు: -మరి ఇందాక కేవలం మంచినీరే అని చెప్పావు. ఇప్పుడు పంచదార కలిపిన నీరని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావ్?
🦜శిష్యుడు : -ఎలా అంటే ఇంతకు మునుపు కేవలం నీటిని మాత్రమే చూసి అందులొే కరిగి ఉన్న పంచదార కానరాక అది కేవలం మంచినీరని పొరపడి చెప్పాను. కానీ ఇపుడు నీటిని త్రాగాను.నీటియందలి పంచదార రుచి అనుభవించిన మూలంగా ఇది పంచదార నీరని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.

🦜గురువు: -అంటే అనుభవ పూర్వకంగా తప్పితే అది పంచదార నీరు అని నీవు తెలుసుకొేలేక పోయావ్ అంతేనా?
🦜శిష్యుడి: -అవును.
🦜గురువు : -సరే ఇపుడు నువ్వు త్రాగినది పంచదార నీరని ఒప్పుకున్నావు. అయితే అ నీటీలో పంచదార చూపించు..
🦜శిష్యుడు : -అసాధ్యం గురువు గారూ..
🦜గురువు : -ఏం ఎందుకని?

🦜శిష్యుడు:- పంచదార పూర్తిగా నీటితో కలసిపోయి ఉంది. దానిని వేరు చేసి చూపించలేం..
🦜గురువు: -అయితే నీవొచ్చిన పని అయిపోయింది తిరిగి వెళ్లిపో…
🦜శిష్యుడు సరైన సమాధానాలే ఇచ్చాడు కాని విషయం సరిగ్గా అవగాహన చేసుకోలేక పోయాడు. గురువుగారు ఏదో పరీక్ష పెడుతున్నారనుకుని సమాధానాలు చెప్తూపోయాడు.
విషయం వివరించాల్సిందిగా గురువుని కోరాడు….

🦜అపుడు గురువు “చూడునాయనా.. నీవు నీటిని చూసి రుచి చూడకనే ఏవిధంగానైతే కేవలం మంచినీరే అని పొరపాటు పడ్డావో అదేవిధంగా మనుష్యులు కేవలం భాహ్య ప్రపంచాన్ని చూస్తూ వాటి సుఖాల్లో పడి దేవుడు లేనిదానిగా సృష్టిని చూస్తున్నారు. కానీ నీవు నీటిని త్రాగి అందులోని తీపి రుచిని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నావు..
🦜అంటే ఎవరైతే తమ ప్రయత్నం ద్వారా దేవుని ఉనికిని తమ అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారో వారికి దైవం ఉన్నదనే సత్యం తెలుస్తుంది. పంచదారనీరు త్రాగిన వారికి తప్ప మిగతా వారందరికీ అది మంచినీరే.. దానిని త్రాగిన వాడికే దాని రుచి తెలుస్తుంది…

🦜అనుభవించిన వారికే దేవుడున్న సత్యం తెలుస్తుంది. మిగతా వారికి అనుభవం లేక దేవుడు లేడని పలు పుకార్లు పుట్టిస్తారు…
🦜ఇంకా నీవు దేవుడుంటే చూపించమని ప్రశ్నిస్తే , నీవు ఏ విధంగానైతే నీటిలో కరిగి పోయి, నీటితో కలసిపోయి ఉన్న పంచదారను నీటి నుండి వేరుచేసి చూపించలేవో, అదే విధాన ఈ సృష్టంతా నిండిపోయి, సూక్ష్మాతి సుక్ష్మరూపంలో అణువణువూ వ్యాపించియున్న భగవంతుడిని ప్రత్యేకంగా వేరుచేసి చూపంచలేం…

🦜సృష్టిలో ఉండే ప్రతీదీ భగవత్స్వరూపమే. జీవుని రూపంలో ఉండేది ఆ భగవంతుడే. రూప నామాలు ఎన్నైనా దేవుడు ఒక్కడే. వాడొక్కడే ఈ చరాచర సృష్టినంతటిని భరించి పోషించు చున్నాడు.

నీవు, నేను, ఈ చెట్టూ, పుట్టా, వాగూ, వంకా అన్నీ భగవంతుని రూపాలే. కనుక దేవుని సర్వాంతర్యామిగా తెలుసుకుని ప్రపంచ సుఖాల పట్ల వ్యామెహం విడచి దైవంపై ప్రేమ ,విశ్వాసాలు కలిగి ఉండు. వాడే నిన్ను ఉద్దరిస్తాడు.” అని చెప్పగా శిష్యుడి ఆనందం అంబరాన్ని తాకింది. తన సందేహం పటాపంచలై పోయింది. గురువు గారికి ప్రణమిల్లి మీరు చెప్పిన విధంగానే నడచుకుంటానని మాటిచ్చి తన స్వస్థానానికి తిరుగు ప్రయాణమయ్యాడు.

🦜ఇది కథలా భావించకండి. ఆత్మ పరిశీలన చేసుకొండి. దేని మూలంగా ఈ జగత్తంతా నడుస్తుందో ఆలోచించండి.
సర్వమ్ ఈశ్వరమయం జగత్

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

SUBSCRIBE FOR MORE

Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading