అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Telugu Short Stories
ఒక పెద్ద ప్రాజెక్టులో పని చేస్తున్న ఒక శాస్త్రవేత్త బాస్ దగ్గరకు వచ్చి, “సార్, ఊళ్ళో ఉన్న ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళమని మా పిల్లలు ప్రాణం తీస్తున్నారు. ఈ రోజు
సాయంత్రం 5.30 కి వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వండి,” బాస్ అనుమతి ఇచ్చాడు. ఆ తరవాత శాస్త్రవేత్త తన పనిలో నిమగ్నమై పోయాడు. కొంత సమయం తర్వాత ఉలిక్కిపడి తలెత్తి గడియారం వైపు చూసాడు, 8.30. “అయ్యో…. ఎంత పనైంది.
పిల్లలు నాకోసం చూసి నిరాశ చెంది ఉంటారు.” బాస్ తో సహా అందరూ వెళ్లిపోయారు. తప్పు చేసినవాడిలా, బాధ పడుతూ, తలొంచుకుని ఇంటి మొహం పట్టాడు. భార్యను ” పిల్లలేరీ…” అని అడిగాడు. “మీకు తెలీదా… మీ మేనేజర్ గారు వచ్చి పిల్లలను ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళారు.”
నిజంగా ఏం జరిగిందంటే, బాస్ పర్మిషన్ ఇచ్చినా, పనిలో మునిగి పోయాడు శాస్త్రవేత్త, ‘ఈయన పని పూర్తయ్యే వరకూ లేవడు,’ అనుకొని, బాస్ వాళ్ళింటికి వెళ్ళి పిల్లలను ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళారు, పిల్లల ఆశలు వమ్ము కాకుండా ! అందుకే తుంబా రాకెట్ లాంచింగ్ స్టేషన్ లో బాస్ తో నిమిత్తం లేకుండా శ్రద్ధగా, నిబద్ధతతో పని చేస్తారు.
పిల్లలను ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళింది ఎవరో తెలుసా ! మన మిసైల్ మాన్, మాజీ రాష్ట్రపతి, APJ అబ్దుల్ కలాం గారు.
సేకరణ – V V S Prasad
Telugu Short Stories
అతి పెద్ద కవితా ప్రపంచం – https://kavithalu.in/