ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Short Stories
రాజుగారి స్నేహితుల్లో ఒక సోమరిపోతు ఉండేవాడు. ఒక రోజు రాజుగారిని ఆ సోమరి అడిగాడు, “ఎందుకు నేను ఏ పనీ చెయ్యలేననీ, మంచి ఉద్యోగం కూడా సంపాదించలేననీ అందరూ అంటున్నారు? అంతేకాదు, నా శత్రువులు కూడా నన్నొక అసమర్థుడిగా చూస్తున్నారు!”
రాజుగారు, ” సాయంత్రం నా ఖజానాకు వచ్చి కావలసినంత డబ్బు, బంగారం తీసుకుపో !! అదంతా నీదే… సరేనా !!” “సరే” అంటూ ఇంటికి పోయి భార్యకు ఈ విషయం చెప్పాడు.
“వెంటనే వెళ్ళి బంగారం, డబ్బు తీసుకు రా, కాలం బంగారంతో సమానం, చేజారి పోతే మళ్ళీ రాదు.” అంటూ గట్టిగా ఒత్తిడి చేసింది. “ఆకలి దంచేస్తోంది, అన్నం తిని పోతాను” అని తినడానికి కూర్చున్నాడు. తిన్న తరవాత భుక్తాయాసంతో ఓ 2గం. పడి నిద్రపోయాడు.
భార్య పోరు పడలేక మధ్యాహ్నం లేచి పెద్దసంచి తీసుకుని రాజుగారి ఖజానాకు బయలుదేరాడు. దారిలో ఎండ వేడిమికి తట్టుకోలేక ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని కూర్చుంటే,నిద్ర పట్టేసింది, మళ్ళీ ఓ 4 గం. ఒళ్ళు తెలీకుండా నిద్ర పోయాడు.
హడావిడిగా లేచి రాజభవనం వైపు పరిగెత్తాడు. అప్పటికే చీకటి పడింది. ద్వారాలు మూసుకున్నాయి. లోపలికి పోలేక పోయాడు. కాలాన్ని నిర్లక్ష్యం చేసి ధనవంతుడయ్యే అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు.
కాలం చాలా విలువైనది. దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. అనవసరంగా వృధా చేస్తే జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది.
సేకరణ- V V S Prasad