Menu Close

ఒక యువకుడు అందమైన యువతిని పెళ్లి చేసుకున్నాడు – Telugu Short Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Short Stories – చిన్న కథలు, పొట్టి కథలు, నీతి కథలు

ఒక యువకుడు అందమైన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అందరూ అతన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. దంపతులు ఇద్దరూ ఆనందమైన జీవితం గడపసాగారు. కొన్నేళ్ల తర్వాత ఆ యువతికి ఒక అరుదైన చర్మ వ్యాధి వచ్చింది. డాక్టర్లు ఎవరూ, ఆమె వ్యాధిని నయం చేయలేకపోయారు.

రోజు రోజుకూ ఆమె అందం ఆ వ్యాధి వలన తరగిపోతుండేది. అందంతో పాటు భర్త ప్రేమ కూడా తరిగి పోతుందేమోనని భయపడేది. ఆమెను ఉత్సాహ పరచడానికి,నిరాశ తొలగించడానికి భర్త కష్టపడ్డాడు, కానీ ఆమె బాధతో కుమిలిపోతూ భర్త నుంచి దూరంగా ఉండేది.

ఒకరోజు భర్త పనిమీద బయటికి వెళ్ళాడు. దారిలో యాక్సిడెంట్ అయింది. అతని రెండు కళ్ళు పొయ్యాయి పాపం. భార్య జరిగిన సంఘటనకు చాలా బాధపడింది. అయితే కొన్నాళ్ళకు సామాన్య జీవితం అలవాటు చేసుకున్నారు. భర్తతోనే ఉంటూ సపర్యలు చేసేది. సంవత్సరాలు గడిచిపోయాయి.

భార్య అందం కూడా కరిగి పోయింది వయసుతో పాటు. కానీ వారి ప్రేమానురాగాలు చెక్కు చెదరలేదు. భార్య చనిపోయింది. ఒంటరి వాడయ్యాడు. అంతిమసంస్కారాలు పూర్తి చేసి దిగాలుగా కూర్చున్నాడు. అప్పుడో స్నేహితుడు అడిగాడు, “ఒంటరిగా చూపు లేకుండా జీవించగలవా? ఇంతకాలం నీ భార్య అన్ని సపర్యలు చేసేది.” భర్త అన్నాడు, “మిత్రమా! నేను గుడ్డివాడిని కాదు.

అదొక నటన మాత్రమే! కురూపి అయిన ఆమెను మరింత బాధ పెట్టడం ఇష్టంలేక గుడ్డివాడిగా ఇన్నేళ్లు నటించాను. ఆమె చాలా మంచి భార్య, ఆమెను ఆనందంగా ఉంచాలనే గుడ్డివాడిగా ఉండిపోయాను.”

అందం ఒక్కటే మనుషుల్ని కలపదు ఒకరి మీద ఒకరికి అపారమైన ప్రేమాభిమానాలు ఉండాలి.

సేకరణ -V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

Telugu Short Stories

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading