ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మీకేమైనా కావాలంటే ముందుగా మీకున్నది పూర్తిగా ఇచ్చేయాలి – Telugu Short Stories
ఎడారిలో తప్పిపోయిన ఆ మనిషి దాహంతో చచ్చిపోయేట్లు ఉన్నాడు. అలా ఎండలో కాళ్ళీడ్చుకుంటూ నడుస్తూ ఉంటే ఓ పాడుబడ్డ ఇల్లు, దాని బయట తుప్పు పట్టిన బోరు బావి కనబడ్డాయి. ప్రాణం లేచి వచ్చి, బలమంతా ఉపయోగించి బోరు కొట్టాడు.
ఒక్క చుక్క నీళ్లు కూడా రాలేదు. ఉసూరుమనిపించి పక్కకు చూస్తే అక్కడ ఒక సీసా, దాన్నిండా నీళ్లు, ఆ పక్కనే ఒక నోటీసు కనిపించాయి. ఆ నోటీసులో, “ముందు పంపులో ఈ సీసాలోని నీళ్ళు పోస్తే నీళ్లు వస్తాయి. తాగి వెళ్ళేప్పుడు మళ్ళీ సీసా నీళ్లతో నింపాలి.” సీసా మూత తీసి చూస్తే దాన్నిండా నీళ్లు ఉన్నాయి. పంపులో నీళ్లు పోయాలా?? నీళ్లు తాగేసి వెళ్లిపోవాలా ??
సందిగ్ధంలో పడ్డాడు. సీసాలో నీళ్లు తాగిస్తే ప్రాణాలు నిలబడతాయి. నోటీసులో చెప్పినట్లు బోరులో పోస్తే నీళ్లు వస్తాయో??రావో? ఏమైతే అదైందని ధైర్యం చేసి సీసాలో నీళ్లు మొత్తం పంపులోకి పోసి, బలంగా పంపు కొట్టాడు. పంపులో నుండి నీళ్ళు జలజలా వచ్చాయి.
కడుపునిండా తృప్తిగా తాగి, సీసాను నీళ్లతో నింపి మూతపెట్టి, నోటీసు కింద, “నమ్మండి, ఈ నోటీసులో చెప్పింది నిజమే! మీకేమైనా కావాలంటే ముందుగా
మీకున్నది పూర్తిగా ఇచ్చేయాలి.”
సేకరణ – V V Prasad